Raw Coconut : చాలా మంది కొబ్బరి నీటిని తాగేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. కానీ పచ్చికొబ్బరిని తినేందుకు ఏ మాత్రం ఆసక్తిని చూపించరు. కానీ పచ్చి కొబ్బరిలోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పచ్చి కొబ్బరిని తినడం వల్ల మనకు పోషకాలు అందుతాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలోనే తరచూ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
పచ్చి కొబ్బరిలో కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, జింక్, విటమిన్ బి1, బి5, బి9 తదితర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పచ్చి కొబ్బరి తినాలి. అలాగే గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటూ ఉంటే గుండె ఆరోగ్యం మెరగవుతుంది. రక్తసరఫరా సరిగ్గా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటే వారి రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. పచ్చికొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
పచ్చి కొబ్బరిని తినడం వల్ల చర్మ సమస్యలు పోతాయి. అలాగే గోర్లు, వెంట్రుకల సమస్యలు కూడా పోతాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి కొబ్బరి మంచి ఆహారం అని చెప్పవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరి తినాలి. దీని వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. అలాగే డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…