Mutton Biryani Recipe In Telugu : మనకు తినేందుకు ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా మటన్ బిర్యానీ భలే టేస్ట్‌గా ఉంటుంది. అవసరమైన పదార్థాలు వేసి, చక్కగా మటన్‌ను ఉడికించి, మసాలాలు వేసి బిర్యానీని వండితే.. ఆ తరువాత ఆ బిర్యానీ నుంచి వచ్చే ఘుమాళింపు మామూలుగా ఉండదు. వాసన చూస్తేనే నోరూరిపోతుంది. మరి అలాంటి ఘుమ ఘుమలాడే మటన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
మటన్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – 1/2 కిలో, ఉప్పు – తగినంత, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్, పసుపు – 1/4 టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ఉల్లిపాయలు – 2, గరం మసాలా – 1 టీస్పూన్, నూనె – 1/2 కప్పు, నిమ్మరసం – 2 టీస్పూన్లు, బాస్మతీ రైస్ – 1/2 కిలో, వెన్న – 2 టీస్పూన్లు, కొత్తిమీర, పుదీనా – 2 కట్టల చొప్పున, పెరుగు – 1/4 కప్పు, యాలకులు – 4, లవంగాలు – 3, దాల్చిన చెక్క – 1 (పెద్దది), బిర్యానీ ఆకులు – 2, బిర్యానీ మసాలా – ఒకటిన్నర టీస్పూన్.
మటన్ బిర్యానీ తయారు చేసే విధానం..
ముందుగా బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత యాలకులు, లవంగాలు, దాల్చిచెక్క, బిర్యానీ ఆకులు, కొద్దిగా వెన్న వేసి ముప్పావు వంతు వరకు బియ్యాన్ని ఉడికించాలి. అనంతరం మటన్ ముక్కలను బాగా కడిగి వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. 20 నిమిషాల పాటు మటన్ ముక్కలను మారినేట్ చేసుకోవాలి.
అనంతరం ఒక పాత్ర తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక మటన్ ముక్కలు వేసి కూరలా ఉడికించాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. తరువాత ఒక పాత్ర తీసుకుని అందులో ముందుగా కొంత అన్నం వేయాలి. దానిపై కాస్త మటన్, కొన్ని ఉల్లిపాయ ముక్కలను పేర్చాలి. అలాగే అన్నీ అయిపోయే వరకు ఒకదాని మీద మరొకటి పేరుస్తూ రావాలి. అనంతరం పాత్రపై మూత పెట్టి 20 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. దీంతో ఘుమ ఘుమలాడే మటన్ బిర్యానీ తయారవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…