Liver Disease Symptoms : మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అతి పెద్ద అవయవాల్లో లివర్ మొదటి స్థానంలో ఉంటుంది. లివర్ అనేక పనులను నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం, మెటబాలిజం సరిగ్గా నిర్వహించడం, పోషకాలను నిల్వ చేయడం వంటి అనేక పనులను లివర్ చేస్తుంది. అయితే చాలా మందికి ఉన్న పలు అలవాట్ల కారణంగా లివర్ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించడం ఒకటి. అయితే మద్యం సేవించకపోయినా కొందరికి వైరస్ ఇన్‌ఫెక్షన్, స్థూలకాయం, జన్యుపరంగా లేదా ఇతర కారణాల వల్ల కూడా లివర్ వ్యాధులు వస్తున్నాయి. లివర్ డ్యామేజ్ కూడా అవుతోంది.
అయితే ఇలాంటి స్థితిలో సత్వరమే సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చికిత్స టైముకు తీసుకుని లివర్‌ను కాపాడుకోవచ్చు. ఇక లివర్ చెడిపోయినా లేదా లివర్ వ్యాధులు వచ్చినా మనకు శరీరం కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. దీంతో త్వరగా ఆ లక్షణాలను పసిగట్టి త్వరగా చికిత్స తీసుకుంటే లివర్‌ను కాపాడుకున్న వారిమవుతాము. ఇక లివర్ వ్యాధి వస్తే కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్ చెడిపోయిన వారిలో లేదా లివర్ వ్యాధి వచ్చిన వారిలో తీవ్రమైన అలసట ఉంటుంది, నీరసంగా అనిపిస్తుంది. చిన్న పనిచేసినా విపరీతంగా అలసిపోతారు. కాస్త దూరం కూడా నడవలేరు. అలాగే లివర్ ఉన్న చోట వాపునకు గురై నొప్పి కూడా వస్తుంది. దీంతోపాటు మూత్రం రంగు కూడా గోధుమ రంగులోకి మారుతుంది. అలాగే పసుపు రంగులో సాధారణంగా వచ్చే మలం మట్టి రంగులోకి మారిపోయి వస్తుంది.
ఇక లివర్ సమస్య ఉన్నవారికి శరీరంలో పలు చోట్ల వాపులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పొట్ట, కాలి పిక్కలు, మడమలు వంటి భాగాల్లో నీరు చేరి వాపులు వస్తాయి. అలాగే చర్మంపై దురదలు వస్తాయి. ముఖ్యంగా అరిచేతులు, అరికాళ్లలో దురదగా అనిపిస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోండి. సమస్య ఉంటే తేలిపోతుంది. దీంతో సరైన సమయంలో చికిత్స తీసుకుని లివర్‌ను కాపాడుకోవచ్చు. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది జాగ్రత్త.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…