Kobbari Laddu : సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లలు ఓ వైపు ఆటపాలతో ఎంజాయ్ చేస్తూ.. మరొక వైపు తినుబండారాలను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పిల్లలు సహజంగానే జంక్ ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే సెలవుల్లో వారు అతిగా జంక్ ఫుడ్ తినేందుకు అవకాశం కూడా ఉంటుంది. కనుక అలాంటి అలవాటును పెద్దలు మాన్పించాలి. అందుకు గాను పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన తినుబండారాలను పెద్దలే వారికి చేసి పెట్టాలి. అలాంటి తినుబండారాల్లో కొబ్బరి లడ్డు కూడా ఒకటి. ఈ లడ్డూలలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కొబ్బరి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
తాజా కొబ్బరి తురుము – 2 కప్పులు, పాలు – 1/2 కప్పు, చక్కెర – 3/4 కప్పు, యాలకుల పొడి – 1/4 టీ స్పూన్, జీడి పప్పు – గుప్పెడు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), నెయ్యి – 1 టీ స్పూన్.
కొబ్బరి లడ్డూ తయారు చేసే విధానం..
బాణలి తీసుకుని స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. అనంతరం అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీడిపప్పు ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొబ్బరి తురుము, చక్కెర వేసి బాగా కలిపి ఉడకబెట్టాలి. మిశ్రమంలో తడి అంతా పోయి గట్టిపడుతుంది. అనంతరం అందులో యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలిపి దింపాలి. మిశ్రమం మరింత చల్లారాక లడ్డూల మాదిరిగా చేతులతో ఒత్తుకోవాలి. గాలి చొరబడని డబ్బాల్లో లడ్డూలను నిల్వ చేయాలి. ఇలా చేసిన లడ్డూలు 2 లేదా 3 రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…