Immune Boosting Tonique : మానవ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే ఏ వ్యాధినైనా అది రాకముందే చాలా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుంది. శరీరంలోకి ప్రవేశించిన క్రిములను, సూక్ష్మ జీవులను వెంటనే చంపగలిగే పవర్‌ఫుల్ రోగ నిరోధక వ్యవస్థ ఉంటేనే వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రావు. తద్వారా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే నేటి యుగంలో అంతా కృత్రిమమే అయిపోయింది. ఈ క్రమంలో ఎవరికైనా వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వచ్చాయంటే చాలు రోజుల తరబడి హాస్పిటల్స్‌కు పరిగెత్తుతూ చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది.
అదే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే అలాంటి ఇబ్బందులు రావు. ఈ క్రమంలో కింద ఇచ్చిన ఓ పవర్‌ఫుల్ డ్రింక్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని నిత్యం తాగితే దాంతో మీ శరీర రోగ నిరోధక వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అవుతుంది. దీంతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రావు. ఒక వేళ ఎవరైనా ఇప్పటికే ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులతో బాధపడుతుంటే అవి కూడా తగ్గిపోతాయి. ఆ డ్రింక్ ఏమిటో, దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు – 1/4 కప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు – 1/4 కప్పు, పసుపు – 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ సైడర్ వెనిగర్ – 700 ఎంఎల్, బాగా పండిన మిరప కాయలు – 2, తురిమిన అల్లం – 1/4 కప్పు, తురిమిన ముల్లంగి – 2 టేబుల్ స్పూన్లు.
వెనిగర్ తప్ప మిగిలిన అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి బాగా కలుపుకోవాలి. దాన్ని ఒక జార్‌లోకి మార్చాలి. ఆ జార్‌లోకి యాపిల్ సైడర్ వెనిగర్‌ను వంపాలి. దీంతో జార్ నిండా నిండిపోతుంది. అనంతరం జార్‌ను మూసి బాగా షేక్ చేయాలి. చల్లగా, పొడిగా ఉండే వాతావరణంలో ఆ జార్‌ను 2 వారాల పాటు అలాగే ఉంచాలి. నిత్యం ఆ జార్‌ను బాగా షేక్ చేస్తూ ఉండాలి. 14 రోజుల తరువాత జార్ ఓపెన్ చేసి అందులోని మిశ్రమాన్ని పిండుతూ ద్రవాన్ని వేరు చేసుకోవాలి. అలా వచ్చిన ద్రవాన్ని మళ్లీ ఇంకో బాటిల్‌లోకి సేకరించి దాన్ని నిల్వ చేసుకోవాలి. ఈ ద్రవాన్ని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు. అయితే ద్రవాన్ని వేరు చేయగా వచ్చిన మిశ్రమాన్ని వంటల్లోనూ వాడుకోవచ్చు.
పైన చెప్పిన విధంగా సేకరించిన ద్రవాన్ని నిత్యం 60 ఎంఎల్ మోతాదులో రోజులో ఏదో ఒక సమయంలో తీసుకోవాలి. కానీ పరగడుపున మాత్రం తాగకూడదు. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నవారు 100 ఎంఎల్ వరకు తాగవచ్చు. లేదంటే 50 ఎంఎల్ చొప్పున రెండు సార్లు, 1 టేబుల్ స్పూన్ చొప్పున అయితే 5 నుంచి 6 సార్ల వరకు ఒక రోజులో తాగవచ్చు. అయితే ఈ ద్రవం రుచిలో కొంత ఘాటుగా ఉంటుంది. దాన్ని తట్టుకోలేమనుకునే వారు కొద్దిగా నీటికి కలిపి తీసుకోవచ్చు.
ఇంట్లోనే మీరు ఈ విధంగా పైన చెప్పిన ద్రవాన్ని టానిక్ రూపంలో నిత్యం తాగుతుంటే దాంతో మీ శరీర రోగ నిరోధక వ్యవస్థ చాలా పవర్‌ఫుల్‌గా మారుతుంది. ఈ టానిక్‌లో సహజ సిద్ధమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పారాసైటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మీ శరీరంలో ఉన్న ఎలాంటి ఇన్‌ఫెక్షన్ అయినా చాలా వేగంగా తగ్గుముఖం పడుతుంది. ఈ టానిక్‌లో ఉన్న వెల్లుల్లి సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తూ వ్యాధులను నయం చేస్తుంది. బాక్టీరియా, సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. ఉల్లిపాయ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. పసుపు నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. బాక్టీరియాలను అంతం చేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ కారకంగా పనిచేస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది. మిరపకాయలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తూ బాక్టీరియాలను నిర్మూలిస్తాయి. అల్లం యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ స్పాస్మోడిక్ గుణాలను కలిగి ఉంటుంది. ఆస్తమా, బీపీలను నియంత్రిస్తుంది. ముల్లంగి శ్వాస కోశ సమస్యలను పరిష్కరిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. ఇన్ని పవర్‌ఫుల్ గుణాలు ఉన్న పదార్థాలను వాడుతాం కాబట్టే పైన చెప్పిన ద్రవం అత్యంత సహజ సిద్ధమైన, పవర్‌ఫుల్ ఇమ్యూన్ బూస్టింగ్ టానిక్‌గా మనకు బాగా ఉపయోగపడుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…