Sweets : తరచుగా స్వీట్స్ మీదకు మనసు మళ్లడానికి కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని సరిదిద్దుకోగలిగితే స్వీట్లతో పెరిగే అదనపు శరీర భారాన్ని అదుపు చేసుకోవచ్చు. ఒత్తిడి, అలసట, నిద్రలేమి.. తీపి తినాలనిపించడానికి ప్రధాన కారణాలు. శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించడం కోసం తీపి మీదకు మనసు మళ్లుతుంది. ఇలా అనిపించిన వెంటనే తీపి పదార్థాల కోసం వెతుక్కోకండి. ఒకసారి తీపి తినడం మొదలుపెడితే అది అలాగే కొనసాగుతుంది. కాబట్టి స్వీట్ల జోలికి వెళ్లకుండా మూల కారణాన్ని సరిదిద్దడం మీద మనసు పెట్టండి.
స్వీట్ల మీద ఇష్టం పెరగడానికి వ్యాయామం కొరవడడం మరో కారణం. శరీరం యాక్టివ్‌గా లేనప్పుడు బద్దకం ఆవరిస్తుంది. దాంతో మనసు కప్ కేక్స్, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. కాబట్టి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం తప్పనిసరి. షుగర్ క్రేవింగ్‌కు డీహైడ్రేషన్ మరో కారణం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చక్కెర పదార్థాలు తినాలపిసిస్తుంది. కాబట్టి తీపి తినాలనిపించినప్పుడు నీళ్లు తాగాలి.
తీపి తినాలనుకునే కోరికను కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ చిట్కాలను పాటించండి. చాక్లెట్లు తినాలనిపిస్తే 70 శాతం డార్క్ చాక్లెట్ రెండు ముక్కలు మాత్రమే తినండి. చిలగడ దుంపలు, స్వీట్ కార్న్, ఎండు ద్రాక్షలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 2 ఖర్జూరాలు, 2 యాప్రికాట్స్, 4 ఎండు ద్రాక్ష, 2 అంజీర్.. వీటిల్లో ఏదో ఒకటి తినవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…