lifestyle

How To Increase Platelets : వీటిని తింటే చాలు.. ప్లేట్‌లెట్ల సంఖ్య ల‌క్ష‌ల్లో పెరుగుతుంది..!

How To Increase Platelets : వ‌ర్షాకాలం కావ‌డంతో స‌హ‌జంగానే మ‌న‌కు సీజ‌న‌ల్ వ్యాధులు వస్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబుతోపాటు జ్వ‌రం కూడా వ‌స్తుంది. అయితే ఇది దోమ‌లు వృద్ధి చెందే సీజ‌న్‌. క‌నుక డెంగ్యూ కూడా ఎక్కువ‌గానే వ‌స్తుంది. డెంగ్యూ వ‌స్తే 3 లేదా 4 రోజుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీంతో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డెంగ్యూ వ‌చ్చిన వారు క‌చ్చితంగా ప్లేట్‌లెట్ల‌ను పెంచే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇక ప్లేట్‌లెట్ల‌ను స‌హ‌జసిద్ధంగా ఎలా పెంచుకోవ‌చ్చు, అందుకు ఎలాంటి ఆహారాల‌ను తీసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

డెంగ్యూ పేషెంట్ల‌కు బొప్పాయి ఆకుల‌ను వ‌రంగా చెప్ప‌వ‌చ్చు. ఈ ఆకుల్లో ప‌పైన్‌, కైమో ప‌పైన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్ల ఉత్ప‌త్తిని పెంచుతాయి. క‌నుక డెంగ్యూ వ‌చ్చిన వారు రోజూ బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగుతుండాలి. దీన్ని రోజుకు పావు టీస్పూన్‌కు మించి తాగ‌కూడ‌దు. లేదంటే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఈ రసాన్ని రోజూ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచ‌డంలో మ‌న‌కు దానిమ్మ పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి.

How To Increase Platelets

దానిమ్మ పండ్ల‌ను తినాలి..

దానిమ్మ పండ్ల‌లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. దీంతో ప్లేట్‌లెట్ల ఉత్ప‌త్తి పెరుగుతుంది. క‌నుక డెంగ్యూ పేషెంట్లు రోజూ దానిమ్మ పండ్ల‌ను తినాల్సి ఉంటుంది. పండ్ల‌ను తిన‌లేక‌పోతే రోజుకు 2 పూట‌లా ఒక్క గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ తాగ‌వ‌చ్చు. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచ‌డంలో మ‌న‌కు గుమ్మ‌డికాయ కూడా ఉపయోగ‌ప‌డుతుంది. దీంట్లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల ఉత్ప‌త్తికి దోహ‌దం చేస్తుంది.

పాల‌కూర‌, కొబ్బ‌రినీళ్లు కూడా..

పాల‌కూర‌లో ఐర‌న్‌, విట‌మిన్ కె స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ప్లేట్ లెట్ల‌ను పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. క‌నుక పాల‌కూర జ్యూస్‌ను కూడా రోజూ తాగ‌వ‌చ్చు. అయితే కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య ఉన్న‌వారు ఈ జ్యూస్ తాగ‌కూడ‌దు. ఇక కొబ్బ‌రినీళ్ల‌లో స‌హ‌జ‌సిద్ధంగా మ‌న‌కు ఎల‌క్ట్రోలైట్స్‌, మిన‌ర‌ల్స్ ల‌భిస్తాయి. క‌నుక రోజూ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగుతున్నా కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చు. దీంతోపాటు క‌ల‌బంద గుజ్జు కూడా ప్లేట్‌లెట్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో స‌హాయ ప‌డుతుంది. అలాగే రోజూ నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగ‌డం, త‌గినంత విశ్రాంతి తీసుకోవ‌డం, వైద్యుల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుతుంటే డెంగ్యూ నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు. దీంతో క్రమ క్ర‌మంగా ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరిగి ఆరోగ్య‌వంతులుగా మారుతారు. వ్యాధి నుంచి త్వ‌ర‌గా విముక్తి ల‌భిస్తుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM