Cardamom : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే యాలకులను తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఇవి సుగంధ ద్రవ్యాల జాబితాకు చెందుతాయి. వీటిని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. యాలకులను ఎక్కువగా తీపి వంటకాల తయారీలో వాడుతారు. అయితే వాస్తవానికి యాలకులను మనం రోజూ తినవచ్చు. రోజూ పరగడుపునే రెండు యాలకులను తిని గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక యాలకులను రోజూ తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారికి యాలకులు ఒక వరం అనే చెప్పవచ్చు. యాలకులను తిని నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. ఇక యాలకులను రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్దకం ఉన్నవారు రోజూ యాలకులను తింటే ఫలితం ఉంటుంది. యాలకులలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.
అందువల్ల యాలకులను తింటే శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి యాలకులు ఎంతగానో మేలు చేస్తాయి. యాలకులను రోజూ తినడం వల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులను తింటే నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఇక యాలకులను రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా యాలకులతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ తినాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…