Green Tea : మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపే పర్‌ఫెక్ట్ డ్రింక్‌గా గ్రీన్ టీ పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు మాత్రమే గ్రీన్ టీ తాగేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ గ్రీన్ అందుబాటులో ఉంది. గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గ్రీన్ టీలో మన శరీరానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దగ్గు, ఫ్లూ జ్వరం తదితర వ్యాధుల నుంచి ఇవి మనల్ని రక్షిస్తాయి.
అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. గ్రీన్ టీలో అసలు క్యాలరీలు ఉండవు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారాలపై ఆసక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. నిత్యం 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ ని తాగడం అలవాటు చేసుకుంటే పొట్ట ఫ్లాట్ అవడం ఖాయం అని సైంటిస్టులు చెబుతున్నారు.
గ్రీన్ టీ లో పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజాన్ని పెంచుతాయి. దీంతో మన శరీరం క్యాలరీలను త్వరగా ఖర్చు చేస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీర మెటబాలిజం రేటు 4 శాతం వరకు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గ్రీన్ టీలో చక్కెర కాకుండా తేనె కలుపుకుని తాగితే ఇంకా అద్భుతమైన లాభాలుంటాయి. అయితే గ్రీన్ ఎంత ఆరోగ్యకరం అయినప్పటికీ దాన్ని మోతాదుకు మించి సేవించరాదు. గ్రీన్ టీ అధికంగా తాగితే డీహైడ్రేషన్, అసిడిటీ పెరుగుతాయి. కనుక గ్రీన్ టీని మోతాదులో తాగితే అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…