Perfume : బయటకు వెళ్లినప్పుడు లేదా ఫంక్షన్లకు హాజరైనప్పుడు సహజంగానే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను స్ప్రే చేసుకుంటుంటారు. దీంతో చెమట వాసన రాకుండా ఉంటుంది. అయితే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను బాడీపై ఇష్టం వచ్చినట్లు స్ప్రే చేస్తారు. ఈ క్రమంలో ఆ పర్‌ఫ్యూమ్ చాలా త్వరగా అయిపోతుంది. మళ్లీ చెమట వాసన మొదలవుతుంది. అయితే మన శరీరంపై పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ సేపు ఉండాలన్నా, బాటిల్‌లో ఉన్న పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ కాలం పాటు అలాగే నిలిచి ఉండాలన్నా.. అందుకు కింద తెలిపిన టిప్స్ పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పెర్‌ఫ్యూమ్‌లు ఉష్ణోగ్రతలకు ప్రభావితం అవుతాయి. అందుకని వాటికి సూర్యరశ్మి తగలకుండా ఉంచాలి. వేడిగా ఉండే ఉష్ణోగ్రతలో కాకుండా పెర్‌ఫ్యూమ్‌లను చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. అలాగే వాటిపై ఇతర కాంతి కూడా పడకుండా చీకటి ప్రదేశంలో ఉంచాలి. దీంతో బాటిల్స్‌లో ఉండే పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ రోజుల పాటు అలాగే ఉంటుంది.
ఇక శరీరంపై స్ప్రే చేసుకునే పెర్‌ఫ్యూం ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండి వాసన రావాలంటే.. ముందుగా మన శరీరాన్ని పూర్తిగా తేమ లేకుండా డ్రైగా ఉండేట్లు చేసుకోవాలి. ఆ తరువాత శరీరంలో చెమట ఎక్కువ వచ్చే ప్రదేశాలను గుర్తించాలి. సాధారణంగా చంకలు, మెడ, మోచేయి లోపలి వైపు, మణికట్టు ప్రాంతాల్లో చాలా మందికి చెమట వస్తుంటుంది. ఆ ప్రాంతాల్లో పెర్‌ఫ్యూం స్ప్రే చేసుకోవాలి. శరీరానికి కొంత దూరం ఉంచి పెర్‌ఫ్యూంను స్ప్రే చేయాలి. దీంతో వాసన ఎక్కువ సేపు ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే శరీరంపై పెర్‌ఫ్యూం ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…