lifestyle

Fish Biryani : చేప‌ల‌తో బిర్యానీ ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు..!

Fish Biryani : చేప‌ల‌తో వేపుడు, పులుసు, కూర ఎవ‌రైనా చేసుకుని తింటారు. అయితే చికెన్‌, మ‌ట‌న్ లాగే చేప‌ల‌తో కూడా బిర్యానీ వండుకుని తిన‌వ‌చ్చు. కొంత శ్ర‌మ, కాసింత ఓపిక ఉండాలే కానీ ఘుమ ఘుమ‌లాడే చేప‌ల బిర్యానీ చేసేందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. పైగా ఆ బిర్యానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మ‌రి చేప బిర్యానీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

చేప బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

చేప ముక్కలు – 1/2 కిలో, షాజీరా – 1 టీస్పూన్, బాస్మతి బియ్యం – 4 కప్పులు, ఉల్లి పాయలు – 1/4 కిలో, పచ్చి మిర్చి – 12, పుదీనా – 1 కట్ట, కొత్తిమీర – 1 కట్ట, కారం – 1 టీస్పూన్, పసుపు – 1/4 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – వేయించడానికి సరిపడా, మిరియాల పొడి – 1 టీస్పూన్, నెయ్యి – 50 గ్రాములు, గరం మసాలా – 1/2 టేబుల్ స్పూన్, పెరుగు – 1 కప్పు, నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు – కొద్దిగా (నాలుగు టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు.

Fish Biryani

చేప బిర్యానీ తయారుచేసే విధానం..

ఒక పాన్ లేదా మందంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందుగా నెయ్యి వేయాలి. అనంత‌రం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, నిలువుగా చీరిన 4 లేదా 5 పచ్చి మిర‌ప‌కాయ‌లు, కొద్దిగా పుదీనా ఆకులు, ఉప్పు, గ‌రం మ‌సాలా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత బాస్మ‌తి బియ్యం వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి స‌గం ఉడికించాలి. క‌డిగిన చేప ముక్క‌ల‌కు కొద్దిగా నిమ్మ‌ర‌సం, కారం, ప‌సుపు, పెరుగు, ఉప్పు బాగా ప‌ట్టించాలి. అనంత‌రం క‌ళాయిలో 1 టీస్పూన్ నూనె వేసి మిగిలిన వాటిలో నుంచి స‌గం ప‌చ్చి మిర‌పకాయ‌లు, స‌గం పుదీనా ఆకులు, కొత్తిమీర తురుం వేసి 2 నిమిషాలు బాగా వేయించాలి. అనంత‌రం చ‌ల్లార‌నివ్వాలి.

ఆ త‌రువాత ముద్ద‌గా చేసుకుని మిరియాల పొడితో స‌హా చేప ముక్క‌ల‌కు ఆ మిశ్ర‌మాన్ని బాగా ప‌ట్టించాలి. క‌ళాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించి తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి. అనంత‌రం పొడ‌వుగా చీల్చిన మిగిలిన ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు, పుదీనా, కొత్తిమీర తురుం కూడా వేసి బాగా వేయించి తీసి ప‌క్క‌న పెట్టాలి. మందంగా ఉండే గిన్నెలో ఒక టీస్పూన్ నూనె వేసి అన్నీ ప‌ట్టించి ఉంచుకున్న చేప ముక్క‌ల మిశ్ర‌మాన్ని ప‌రిచి దాని మీద ఉల్లిముక్క‌ల మిశ్ర‌మాన్ని చ‌ల్లి నిమ్మ‌ర‌సం పిండాలి. వాటి మీద స‌గం ఉడికించిన అన్నం వేసి అనంత‌రం ఒక టీస్పూన్ వేడి నూనె, టీస్పూన్ నెయ్యి చ‌ల్లుకోవాలి. వాటి మీద కుంకుమ పువ్వు క‌లిపిన పాలు పోసి మూత పెట్టి సిమ్‌లో 25 నిమ‌షాల పాటు ఉడికించాలి. అంతే.. ఘుమ ఘుమలాడే వేడి వేడి చేప బిర్యానీ రెడీ అవుతుంది.

Share
IDL Desk

Recent Posts

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM