Egg Bonda : కోడిగుడ్లతో చేసే ఏ వంటకాన్నయినా.. ఎవరైనా ఇష్టంగానే తింటారు. అయితే వాటిని బోండాలుగా వేసుకుని తినేవారు చాలా తక్కువగానే ఉంటారు. నిజానికి కాసింత శ్రమ పడి ఎగ్‌బొండాలను చేయాలే కానీ వాటి రుచి అదిరిపోయేలా ఉంటుంది. ఎగ్ బొండాలను చిన్నారులకు పెడితే వారికి రుచికి రుచి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి. మరి ఎగ్ బొండాలను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో, వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.
ఎగ్ బొండా తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు (ఉడకబెట్టినవి) – 3, నూనె – 1 కప్పు, బియ్యపు పిండి – అర కప్పు, కారం – అర టీస్పూన్, మిరియాల పొడి – కొద్దిగా, పచ్చిమిరప కాయలు – 2, శనగపిండి – 1 కప్పు, ఉప్పు – తగినంత.
ఎగ్ బొండా తయారు చేసే విధానం..
ఉడికబెట్టిన గుడ్లను ముక్కలుగా చేయాలి. వాటిపై కారం, మిరియాల పొడి, ఉప్పు సరిపోయినంత చల్లుకోవాలి. పాన్ తీసుకుని అందులో నూనె వేసి సన్నని మంటపై వేడి చేయాలి. ఒక పాత్ర తీసుకుని.. అందులో శనగపిండి, బియ్యపు పిండి, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి, నీళ్లు పోసి బొండాలకు సరిపడేలా పిండిని తయారు చేయాలి. పిండి చిక్కగా ఉండాలి.
నూనె వేడి అయ్యాక ఉడికిన కోడిగుడ్డు ముక్కలను అంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు ముక్కలను వేయించాలి. దీంతో వేడి వేడి ఎగ్ బొండాలు తయారవుతాయి. వాటిని టమాటా సాస్ లేదా పుదీనా చట్నీతో కలిపి తింటే.. ఆహా.. ఆ రుచే వేరేగా ఉంటుంది. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే. అంత కమ్మగా ఎగ్ బొండాలు ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…