Eating On Cot : చాలామంది తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. కొన్ని తప్పులు చేయడం వలన, మనమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం, ఈ తప్పులను చేయకుండా చూసుకోవాలి. కొంతమంది, మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. పెద్దలు అలా వద్దని చెప్పినా కూడా, ఆ మాటని కొట్టి పారేస్తూ ఉంటారు. మంచం మీద కూర్చుని తినడం వలన, కొన్ని సమస్యలు అయితే వస్తాయట. మంచం మీద కూర్చుని తింటే, వాస్తు ప్రకారం ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం.
ప్రతి ఒక వ్యక్తికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు మంచివా..? కావా..? అన్నది ఆలోచించుకోరు. ఇటువంటి తప్పులు చేయడం వలన, సమస్యలు వస్తాయి. ఈశాన్యంలో బరువుని పెట్టడం, లక్ష్మీదేవిలా భావించే గడప మీద కూర్చోవడం వంటివి చాలా తప్పు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన, ఇబ్బందులు వస్తాయి. వాస్తు ప్రకారం ఈ అలవాట్లు కూడా ఉండకూడదు. ఇవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి.
చాలామంది, మంచం మీద కూర్చుని ఆహారాన్ని తింటూ ఉంటారు. వాస్తు ప్రకారం, లక్ష్మీదేవికి మంచం మీద కూర్చుని తినడం వలన, కోపం వస్తుంది. ఆ ఇంటి నుండి కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్తూ లక్ష్మీదేవి డబ్బుని, సంతోషాన్ని తీసుకువెళ్లి పోతుంది. అందుకని మంచం మీద కూర్చుని అసలు తినకూడదు. మంచం మీద కూర్చుని తింటే ఆనందం, శాంతి కూడా పోతాయి. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన కుటుంబ సభ్యులపై అప్పులు కూడా పెరిగిపోతాయి.
మంచం మీద కూర్చుని ఆహారం తినే వ్యక్తి, నరకానికి వెళ్తాడని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి, ఇలా ఎప్పుడు చేయకండి. ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటారు చాలామంది. అది కూడా, అస్సలు మంచిది కాదు. ఉదయం లేవగానే దేవుడు ని చూడడం మంచిది. రాత్రి పడుకున్నాక, ఉదయం లేవగానే మంచాన్ని సరిగ్గా సర్దుకోవాలి. ఎప్పుడు మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
అప్పుడే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మంచం పై చెత్తాచెదారం, దుమ్ము ధూళి వంటివి లేకుండా చూసుకోవాలి. లేదంటే డబ్బులు లేకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే, ఈ తప్పు జరగకుండా చూసుకోండి. చాలామంది రాత్రి పూట భోజనాలు అయిపోయిన తర్వాత వంటగదిని మురికి గా ఉంచేస్తారు. తినేసిన వాటిని అన్నిటిని, వంటగదిలోనే ఉంచేస్తారు అలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…