నేటి తరుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్న విషయం విదితమే. ముఖ్యంగా అనేక మందికి అకస్మాత్తుగా, అనుకోకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం ఉంటున్నాయి. అయితే ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. యుక్త వయస్సులో ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్స్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే నిత్యం 40కి పైగా పుషప్స్ చేసే వారికి ఏ గుండె జబ్బు రాదని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనంలో తెలిసింది.
హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్టు బృందం 10 ఏళ్ల పాటు 40 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న 1104 మంది పురుషులను పరిశీలించింది. వారు నిత్యం తీసుకునే ఆహారం, చేసే ఎక్సర్‌సైజ్ లు, వారికి వచ్చిన గుండె సమస్యలను రికార్డు చేసింది. ఈ క్రమంలో తెలిసిందేమిటంటే.. నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువగా పుషప్స్ చేసిన వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 96 శాతం వరకు తక్కువగా ఉంటుందని, అసలు పుషప్స్ చేయని వారిలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడ్డారని సైంటిస్టులు నిర్దారించారు.
కనుక పై పరిశోధన ప్రకారం.. సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. ఎవరైనా నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువగా పుషప్స్ చేస్తే చాలు.. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని అంటున్నారు. పుషప్స్ చేయడం వల్ల ఛాతి, కండరాలకు బాగా వ్యాయామం అవుతుందని, రక్త సరఫరా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అందువల్లే హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయని వారు అంటున్నారు. కనుక నిత్యం 40 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పుషప్స్ చేయండి చాలు, మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…