lifestyle

Dal Tadka : ధాబాల‌లో అందించే దాల్ త‌డ్కా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Dal Tadka : సాధార‌ణంగా ప‌ప్పుతో చేసుకునే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు అనేక ర‌కాల పప్పు వంట‌కాలు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాల్ త‌డ్కా ఒక‌టి. దీన్ని ధాబాల్లో అద్భుతంగా చేస్తారు. అయితే కొద్దిగా శ్ర‌మించాలే గానీ మ‌నం ఇంట్లోనూ ధాబా స్టైల్‌లో దాల్ త‌డ్కాను చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. మ‌రి దాల్ త‌డ్కాను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

దాల్ త‌డ్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిపప్పు- 1/2 కప్పు, పెసరపప్పు- 1/2 కప్పు, శనగపప్పు- 1/4 కప్పు, మైసూర్ పప్పు- 1/4 కప్పు, చిన్న ఉల్లిపాయ – 1, చిన్న టమాటా – 1, పచ్చిమిర‌పకాయ‌లు – 2, అల్లం – చిన్నముక్క, ధనియాలపొడి – 1/4 టీ స్పూన్, గరం మసాలా- 1/4 టీ స్పూన్, ఉప్పు- 1/2 టీ స్పూన్, పసుపు- 1/4 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ- 1/2 టీ స్పూన్, కసూరి మేథీ- 1/4 టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – 1/4 కప్పు, చింతపండు రసం – 2 టీ స్పూన్లు.

Dal Tadka

దాల్ త‌డ్కా త‌యారీ విధానం..

పైన చెప్పిన ప‌ప్పుల‌న్నింటినీ క‌లిపి కుక్క‌ర్‌లో మెత్త‌గా ఉడికించుకోవాలి. బాణ‌లి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడెక్కాక‌.. జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండు మిర‌ప‌కాయ‌లు, ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. అనంత‌రం అందులో క‌ట్ చేసిన ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు, ట‌మాటాల‌ను వేసి బాగా వేయించుకోవాలి. అనంత‌రం అందులో ఉప్పు, ప‌సుపు కూడా వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మెత్త‌గా ఉడికిన ప‌ప్పు మిశ్ర‌మాన్ని మ‌రింత మెత్త‌గా చేసి పోపులో వేయాలి.

ఆ త‌రువాత ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, క‌సూరీ మేథీ వేసుకోవాలి. అవ‌సరం అనుకుంటే అందులో చింత పండు ర‌సం కూడా క‌లుపుకోవ‌చ్చు. ఆ త‌రువాత ప‌ప్పును బాగా క‌లిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంత‌రం దానిపై కొత్తిమీర వేసి దింపాలి. అంతే.. ఘుమ ఘుమ‌లాడే దాల్ త‌డ్కా త‌యార‌వుతుంది. దీన్ని చ‌పాతీలు లేదా అన్నంతో లాగించేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM