Curd And Jaggery : నిత్యం మనం తినే అనేక ఆహారాల్లో పెరుగు, బెల్లం కూడా ఒకటి. పెరుగును చాలా మంది భోజనం చివర్లో తింటుంటారు. అలాగే పెరుగుతో మజ్జిగ చేసుకుని తాగుతుంటారు. ఇక బెల్లం విషయానికి వస్తే దీంతో అనేక రకాల పిండి వంటలను చేస్తుంటారు. బెల్లాన్ని నేరుగా కూడా కొందరు తినేందుకు ఇష్టపడతారు. అయితే ఈ రెండింటి కాంబినేషన్ చూస్తే మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రెండింటినీ కలిపి రోజూ తీసుకోవడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. పెరుగు, బెల్లం రెండింటినీ కలిపి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, బెల్లం రెండింటి కాంబినేషన్ మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. ఇది అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అవసరం అయిన క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్‌ను అందిస్తుంది. మీరు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నా, లేక తరచూ వ్యాధుల బారిన పడుతున్నా పెరుగు, బెల్లం మిశ్రమాన్ని ట్రై చేయండి. మీకు అద్భుతమైన రిజల్ట్‌ను ఇస్తుంది. ఇక దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
మీకు రక్తహీనత ఎక్కువగా ఉంటే మీరు పెరుగు, బెల్లం కాంబినేషన్ ను తప్పక తీసుకోవాల్సిందే. దీన్ని తినడం వల్ల రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత సమస్య దూరమవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు అంటే మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు ఉన్నప్పుడు పెరుగు, బెల్లం కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది. ఇక అధికంగా బరువు ఉన్నవారు కూడా పెరుగు, బెల్లం కాంబినేషన్ ను ట్రై చేయాల్సిందే.
పెరుగు, బెల్లం కలిపి తింటే పొట్ట అంతా నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోరు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. ఇలా పెరుగు, బెల్లం మనకు అనేక లాభాలను అందిస్తాయి. కనుక ఈ రెండింటినీ రోజూ తీసుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…