Bobbara Vadalu : పిల్లలు సహజంగానే ఇండ్లలో తినే పదార్థాల కోసం చూస్తుంటారు. అసలే బయట పదార్థాలను తినలేం కనుక పిల్లలు సాధారణంగా బయటకు వెళ్లకుండా.. తమ తమ ఇండ్లలో ఉండే తినుబండారాలను తినేందుకే ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఈ క్రమంలోనే పెద్దలు కూడా వారికి సాంప్రదాయ తినుబండారాలను చేసి పెట్టాలని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి బొబ్బర్ల వడలు. వీటిని చాలా త్వరగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి. ఈ క్రమంలో బొబ్బర్ల వడలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొబ్బర్ల వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
బొబ్బర్లు – 2 కప్పులు, పచ్చిమిర్చి – 4, అల్లం – చిన్నముక్క, జీలకర్ర – 1 టీస్పూన్, కొత్తిమీర – 1/4 కప్పు, కరివేపాకు – 1/4 కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా.
బొబ్బర్ల వడలను తయారుచేసే విధానం..
బొబ్బర్లను 6 గంటల పాటు బాగా నానబెట్టాలి. అవి నానాక నీళ్లు పారబోసి మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, బొబ్బర్లు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. మెత్తగా రుబ్బితే వడలు స్మూత్ గా వస్తాయి. అది వద్దనుకుంటే ఆ మిశ్రమాన్ని కచ్చా పచ్చాగానే రుబ్బాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలిపి వడల్లా గుండ్రంగా చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి. దీంతో ఘుమ ఘుమ లాడే బొబ్బర్ల వడలు రెడీ అవుతాయి. వీటిని అలాగే తినవచ్చు. లేదా కొబ్బరి, టమాటా, పల్లి చట్నీలో తినవచ్చు. ఇలా తింటుంటే ఎంతో రుచిగా ఉంటాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…