lifestyle

Athlets Foot : ఈ ఆరోగ్య స‌మ‌స్య మీకు ఉందా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Athlets Foot : ఫంగస్ వ‌ల్ల మ‌న కాలి వేళ్ల‌కు వ‌చ్చే ఓ ర‌క‌మైన చ‌ర్మ వ్యాధినే అథ్లెట్స్ ఫుట్ (Athlete’s foot) అంటారు. ఇది Trichophyton rubrum, Epidermophyton floccosum, Trichophyton mentagrophytes అనే 3 ర‌కాల ఫంగ‌స్‌ల వ‌ల్ల వస్తుంది. అలాగే కాలివేళ్ల‌కు చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌డం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువగా ఉండ‌డం, పాదాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేక‌పోవ‌డం, స‌రిగ్గా శుభ్రం చేయ‌ని సాక్సులు వాడ‌డం, ప‌బ్లిక్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్ట‌డం, కాళ్ల‌కు ర‌క్ష‌ణ లేకుండా మురికి నీటిలో తిర‌గ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల కూడా ఈ వ్యాధి వ‌స్తుంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్ర‌తి 100 మందిలో 3 నుంచి 15 మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

అథ్లెట్స్ ఫుట్ వ‌చ్చిన వారిలో పాదాలు ప‌గ‌ల‌డం, దుర‌ద పెట్ట‌డం, చర్మం కందిన‌ట్లు ఎరుపుగా మార‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అలాగే పొక్కులు వ‌స్తాయి. నొప్పి ఉంటుంది. ఈ క్ర‌మంలో ఇన్‌ఫెక్ష‌న్ కాలి వేళ్ల చివ‌ర‌కి కూడా వ్యాపిస్తుంది. దీంతో మ‌రింత నొప్పి, మంట‌, దుర‌ద క‌లుగుతాయి. అయితే ఈ వ్యాధి ఉన్న‌వారు మ‌రొక‌రిని తాకితే అది నేరుగా వారికి సంక్ర‌మించేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదా వారు వాడిన సాక్సులు, ఇత‌ర వ‌స్తువుల‌ను ఉప‌యోగించినా ఈ వ్యాధి వ‌స్తుంది. ఇక కుటుంబంలో ఈ వ్యాధి ఎవ‌రికైనా వ‌స్తే.. జ‌న్యు ప‌రంగా వారి త‌రువాతి త‌రాల వారికి కూడా ఈ వ్యాధి వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

Athlets Foot

డెర్మ‌టైటిస్ అన‌బ‌డే స్కిన్ ఇన్‌ఫెక్ష‌న్ ఉన్నవారి చ‌ర్మంపై ద‌ద్దుర్లు ఎక్కువ‌గా వ‌స్తాయి. దీంతో వారు అథ్లెట్స్ ఫుట్ బారిన ప‌డే అవ‌కాశం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఇక అథ్లెట్స్ ఫుట్ వ్యాధి బారి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. పాదాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెమ‌ట ఎక్కువ‌గా వ‌చ్చే వారు సాక్సులు లేదా వాటితో క‌లిపి షూస్‌ను కూడా ధ‌రించ‌రాదు. వీలైనంత వ‌ర‌కు పాదాల‌కు గాలి సోకేలా చూసుకోవాలి. అలాగే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు యాంటీ ఫంగ‌ల్ క్రీములు, పౌడ‌ర్లు ఉప‌యోగించాలి. దీంతోపాటు వెల్లుల్లి ర‌సాన్ని పాదాల‌పై రాయ‌డం, టీ ట్రీ ఆయిల్ తో మ‌ర్ద‌నా చేయ‌డం చేస్తే.. ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. ఈ క్ర‌మంలో 2 నుంచి 4 వారాల్లోపు స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనం ల‌భించ‌క‌పోతే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు అవ‌స‌రం అయితే మ‌ళ్లీ వెళ్లాలి. స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే ఇన్‌ఫెక్ష‌న్ పెద్ద‌దై ప్రాణాల మీద‌కు రావ‌చ్చు. క‌నుక త‌గిన స‌మ‌యంలో స్పందించి వ్యాధిని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM