Antacids : మద్యం అతిగా సేవించడం, ఒత్తిడి.. జీర్ణ సమస్యలు.. మసాలాలు, కారం ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం.. అల్సర్లు.. తదితర అనేక కారణాల వల్ల మనలో అధిక శాతం మందికి కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. అయితే కడుపులో మంటకు మెడికల్ షాపుల్లో దొరికే అంటాసిడ్లను చాలా మంది వాడుతుంటారు. కొందరు టాబ్లెట్లు వేసుకుంటే, కొందరు అంటాసిడ్ సిరప్‌లను తాగుతుంటారు. అయితే నిజానికి అంటాసిడ్లను ఎక్కువగా వాడడం మంచిది కాదు. వాటితో మనకు అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.
అంటాసిడ్లు సహజంగానే కడుపులో మంటను చాలా తేలిగ్గా, త్వరగా తగ్గిస్తాయి. దీంతో కడుపులో మంట అనిపించగానే చాలా మంది ఆ సిరప్‌లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో కొని తీసుకువచ్చి తాగుతుంటారు. అయితే అంటాసిడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అవి పనిచేయకుండా పోతాయి. దీంతో సమస్య ఇంకా ఎక్కువవుతుంది. కడుపులో మంట పెరుగుతుంది. అప్పుడు అంటాసిడ్లను ఎన్నింటిని తీసుకున్నా ఫలితం ఉండదు.
ఇక అంటాసిడ్లను అధికంగా వాడడం వల్ల చాలా త్వరగా అలసిపోతుంటారు. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తారు. ఒంట్లో శక్తి లేనట్లు అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా అలసటగా అనిపిస్తుంది. అలాగే ఒక్కోసారి విరేచనాలు కూడా సంభవిస్తాయి. ఇక కొందరికి తీవ్రమైన మలబద్దకం ఏర్పడుతుంది. మలంలో రక్తం కూడా పడుతుంది. కొందరిలో విరేచనం చాలా కష్టంగా అవుతుంది. కనుక అంటాసిడ్లను ఎక్కువగా వాడేవారు వాటి వాడకాన్ని నియంత్రిస్తే మంచిది. లేదా డాక్టర్ సూచన మేరకు వాటిని వాడుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…