Acidity : మనలో అధికశాతం మందికి సహజంగనే కారం, మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు లేదా మద్యం అధికంగా సేవించినప్పుడు కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దీన్నే గ్యాస్ట్రయిటిస్ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య వస్తే ఒకటి, రెండు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరికి ఈ సమస్య ఒక పట్టాన తగ్గదు. అలాంటి వారు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. ఒక గ్లాస్ చల్లని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తాగితే కడుపులో మంట నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజుకు రెండు, మూడు సార్లు చేస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
కొబ్బరినీళ్లను తరచూ తాగడం వల్ల కూడా కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. కొబ్బరి నీళ్లు జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో కడుపులో మంట తగ్గుతుంది. అల్లం రసంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అల్లం రసాన్ని రోజుకు నాలుగైదు సార్లు తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది. అవసరం అనుకుంటే అందులో తేనె కూడా కలుపుకోవచ్చు. పచ్చి బొప్పాయి పండ్లను తినడం వల్ల కూడా కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. వాటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కడుపులో మంటను తగ్గిస్తాయి.
బేకింగ్ సోడా అంటాసిడ్‌లా పనిచేస్తుంది. అందువల్ల బేకింగ్ సోడాతో కడుపులో మంటను తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఆ నీటిని తాగితే కడుపులో మంట తగ్గుతుంది. క్యాబేజీ, క్యారెట్లను జ్యూస్‌గా చేసుకుని తాగినా కడుపులో మంట తగ్గుతుంది. వీటిలో ఉండే ఔషధ కారకాలు కడుపులో ఏర్పడే అల్సర్లను నయం చేస్తాయి. అలాగే జీర్ణాశయం లోపలి వైపు ఉన్న పొరను యాసిడ్ల బారి నుంచి రక్షిస్తాయి. అందువల్ల కడుపులో మంట తగ్గుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…