lifestyle

5 Coolest Places In India : చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు టూర్ వేయాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఈ 5 ప్రాంతాల‌ను ఒక్క‌సారి చూడండి..!

5 Coolest Places In India : వేస‌వి కాలం.. మే నెల‌.. ప‌ర్యాట‌కుల‌కు అనువుగా ఉండే మాసం.. ఎందుకంటే సాధార‌ణంగా ఈ నెల వ‌చ్చే వ‌ర‌కు విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు అయిపోతాయి. దీంతో త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు తీసుకెళ్లాల‌ని చూస్తుంటారు. అందుక‌నే చాలా మంది ఈ నెల‌లో టూర్లు వేస్తుంటారు. అయితే మండుతున్న ఎండ‌ల దృష్ట్యా చాలా మంది చ‌ల్ల‌ని ప్రాంతాల‌కే ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే మ‌న దేశంలో ఉన్న అత్యంత చ‌ల్ల‌ని ప్రాంతాల వివ‌రాల‌ను మీకందిస్తున్నాం.. వేస‌విలో ఈ ప్రాంతాల్లో ఎంచ‌క్కా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. వేసవి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. చ‌ల్ల‌గా విహారం చేయ‌వ‌చ్చు. మ‌రింకెందుకాల‌స్యం.. ఆ ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

1. కూర్గ్

కోయంబ‌త్తూర్‌కు సుమారుగా 100 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. బెంగ‌ళూరు లేదా కొచ్చి నుంచి కూడా కూర్గ్‌కు వెళ్ల‌వ‌చ్చు. ఇక్క‌డ స‌ముద్ర మ‌ట్టానికి 1500 మీట‌ర్ల ఎత్తులో ఉండే ప‌చ్చ‌ని ప‌ర్వ‌త ప్రాంతాల్లో విహ‌రిస్తుంటే.. మనం మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచాన్ని కచ్చితంగా మ‌రిచిపోతాం. అంత అద్భుత‌మైన ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త ఇక్క‌డ ఉంటుంది. అలాగే ఇక్క‌డ ఉష్ణోగ్ర‌త‌లు ఎప్పుడూ 28 డిగ్రీల క‌న్నా త‌క్కువ‌గానే ఉంటాయి. అందువ‌ల్ల వేసవిలో ఈ ప్రాంతంలో విహ‌రించేందుకు అనువుగా ఉంటుంది.

5 Coolest Places In India

2. డార్జిలింగ్

బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్ట్ నుంచి డార్జిలింగ్ సుమారుగా 100 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఇక్క‌డ‌ మే నెల‌లో అద్భుత‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. టీ ల‌వ‌ర్ల‌కు అద్భుత‌మైన‌, అనేక ర‌కాల టీ వెరైటీలు ఇక్క‌డ ల‌భిస్తాయి. అలాగే ప‌చ్చ‌ని ప‌ర్వత ప్రాంతాల్లోనూ విహ‌రించ‌వ‌చ్చు.

3. కాశ్మీర్

వేసవిలో చాలా మంది వెళ్లాల‌నుకునే చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో కాశ్మీర్ కూడా ఒక‌టి. ఇక్క‌డ మంచు ప‌ర్వ‌తాల‌ను, ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. ప‌ర్యాట‌కుల‌కు ఈ ప్రాంతం మ‌ధురానుభూతుల‌ను పంచుతుంది.

4. కొడైకెనాల్

ఈ ప్రాంతం స‌ముద్ర మ‌ట్టానికి సుమారుగా 2100 మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది. కొడైకెనాల్ అంటే ది గిఫ్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ అని పిలుస్తారు. పేరుకు త‌గిన‌ట్లుగానే ఇక్క‌డ ప‌చ్చని అర‌ణ్యాలు, ప‌చ్చిక బ‌య‌ళ్లు ప‌ర్యాట‌కుల‌కు స్వాగ‌తం ప‌లుకుతుంటాయి. చ‌ల్ల‌ని గాలుల న‌డుమ వేస‌విలో ఇక్క‌డ సేద‌దీరుతుంటే వ‌చ్చే మ‌జాయే వేరు.

5. మ‌నాలి

షిమ్లా నుంచి 250 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. వేస‌విలో ఈ ప్రాంతానికి చాలా మంది ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. స‌ముద్ర మ‌ట్టానికి ఈ ప్రాంతం 2వేల మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది. చ‌లికాలంలో శ‌రీరం గ‌డ్డ క‌ట్టుకుపోయే చ‌లి ఇక్క‌డ ఉంటుంది. కానీ వేస‌విలో చ‌ల్ల‌దనాన్ని ఇక్కడ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అలాగే ప‌ర్వ‌తాల‌పై విహ‌రించ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM