Guava : రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదని చెబుతుంటారు. అయితే నిజానికి యాపిల్ పండ్లు చాలా ఖరీదైనవి. అవి అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం సంపన్నులు మాత్రమే నిత్యం తినగలిగిన పండ్లు అవి. అయితే యాపిల్ పండ్లను తినలేకపోయినా.. మనకు సరిగ్గా వాటిలాంటి లాభాలనిచ్చే పండు కూడా ఉంది. అదే జామపండు.. జామకాయ.. ఎలా పిలిచినా సరే.. వీటిని తినడం వల్ల మనకు సరిగ్గా యాపిల్ పండును తిన్న లాభాలే కలుగుతాయి. ఈ క్రమంలోనే జామకాయలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
జామకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సహజంగానే చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం బాధిస్తుంటాయి. అయితే ఆ సమస్యల నుంచి బయట పడాలంటే జామకాయలను తినాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరితే గుండె జబ్బులు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే శరీరంలో ఉన్న కొవ్వును కరిగించేందుకు జామకాయలను తినాలి. అలాగే హైబీపీ రాకుండా ఉండాలన్నా.. బీపీ నియంత్రణలో ఉండాలన్నా జామకాయలను రోజూ తినాలి.
దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు జామకాయలను తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి దంతాలను దృఢంగా చేస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారకుండా, చిగుళ్లు వాపులకు గురికాకుండా చూస్తుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు నిత్యం జామకాయలను తింటే షుగర్ అదుపులో ఉంటుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే జామకాయల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…