దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఐబీపీఎస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. మొత్తం 500 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7 వరకు గడువు విధించారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.hdfcbank.com/ ను అభ్యర్థులు సందర్శించవచ్చు.
మొత్తం 500 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు ఖాళీ ఉండగా.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ చేసి ఉండాలి. 1-10 సంవత్సరాల ఉద్యోగానుభవం ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ అయిన ఫిబ్రవరి 7 వరకు 35 ఏళ్లు మించకూడదు. జీతం ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఇస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. విశాఖ పట్నం, ఢిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబై, పుణె, అమృతసర్, జయపుర, హైదరాబాద్, లక్నో, కోల్‌కతా నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షను మార్చిలో నిర్వహిస్తారు. తేదీని త్వరలోనే వెల్లడిస్తారు. రాత పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు సాధించాలి. తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను…
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలనుకునే వారి కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. గతంలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడేవారు. కానీ…
ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ జాబ్స్ మీకోసమే అని చెప్పవచ్చు. ఒరాకిల్ కంపెనీ పలు…
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే టెక్ మహీంద్రా కంపెనీ మీకు సదవకాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థలో ఖాళీగా ఉన్న…
యూకో బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి…