బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. కెనరా బ్యాంకులో కాంట్రాక్టు బేసిస్ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్‌ను కూడా రిలీజ్ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగం చేయాలని భావిస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు https://canarabank.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జనవరి 24ను చివరి తేదీగా నిర్ణయించారు.
మొత్తం 60 ఖాళీలు ఉండగా అప్లికేషన్ డెవలపర్ పోస్టులు 7, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ 2, అనలిస్ట్ 8, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ 9, డేటా ఇంజినీర్ 2, డేటా మైనింగ్ ఎక్స్‌పర్ట్ 2, డేటా సైంటిస్ట్ 2, ఎథికల్ హ్యాకర్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్ 1, ఈటీఎల్ స్పెషలిస్ట్ 2, జీఆర్‌సీ అనలిస్ట్ ఐటీ గవర్నెన్స్, ఐటీ రిస్క్ అండ్ కంప్లయన్స్ 1, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ 6, ఆఫీసర్ 7, ప్లాట్‌ఫామ్ అడ్మినిస్ట్రేటర్ 1, ప్రైవేట్ క్లౌడ్ అండ్ వీఎం వేర్ అడ్మినిస్ట్రేటర్ 1, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ 1, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు 8 ఖాళీగా ఉన్నాయి.
డేటా అనలిస్ట్, డేటా మైనింగ్ ఎక్స్‌పర్ట్, డేటా సైంటిస్ట్, అప్లికేషన్ డెవలపర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీసర్ ఐటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఐటీలో గ్రాడ్యుయేట్, BE / BTech కలిగి ఉండాలి. గతంలో పని చేసిన అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి డిసెంబర్ 1, 2024 నాటికి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్‌తో పాటు లోకల్ రీజనింగ్‌పై 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక్క తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కు ఉంటుంది.
స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు వేతనం ఉంటుంది. అంటే నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు వస్తుందన్నమాట. అభ్యర్థులు మరిన్ని వివరాలకు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడవచ్చు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను…
న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను…