ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి, విక్రమ్ అని ఇద్దరూ ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ కూడా పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. రవి బాగా డబ్బు భూమి ఉన్న వ్యక్తి. విక్రమ్ మాత్రం చాలా పేద రైతు. ఎన్నో కష్టాలను ఎదుర్కొనేవాడు. ఏది ఏమైనా ఎవరి కుటుంబానికి వాళ్ళు ప్రేమనురాగాలని పంచేవారు ఒక రోజు ఆ గ్రామం లో తీవ్రమైన కరువు ఏర్పడింది. పంటలు, భూమి ఎండిపోయాయి బంజరు భూమిగా మారిపోయింది. అయితే రవి తన సంపద తనని కాపాడుతుందని అప్పటివరకు ఎదురుచూడాలని అనుకున్నాడు.
విక్రమ్ అదృష్టం మీద ఆధారపడలేదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు విక్రమ్ ఇరుగుపొరుగు గ్రామాలలో ఉండే రైతులు దగ్గరికి వెళ్లి ఎలా పంటలు పండించాలి అనేది నేర్చుకున్నాడు. విక్రమ్ ఎలా అయినా కష్టాల నుండి గట్టెక్కాలని అనుకున్నాడు. అందుకు కొన్ని రకాల పద్ధతుల్ని నేర్చుకున్నాడు నీటి సంరక్షణ పద్ధతుల్ని కరువు నిరోధక పంటలు సమర్థవంతమైన నీటిపారుతుల వ్యవస్థలు ఇటువంటివన్నీ తెలుసుకుని తన కుటుంబాన్ని పోషించే మార్గాన్ని వెతుక్కున్నాడు.
ఎంతో కష్టపడి తను నేర్చుకున్న టెక్నిక్స్ తో పాటుగా కష్టాన్ని నమ్ముకుని కష్టాల్లో ఉన్న తోటి రైతులతో పాటుగా పంటలు పండించడం మొదలుపెట్టాడు. కొన్ని నెలలు గడిచాయి. కొన్నాళ్ళకి వర్షాలు పడ్డాయి. విక్రమ్ పంటలు బాగా పండాయి. రవి భూమి మాత్రం అలానే ఉండిపోయింది విక్రమ్ సక్సెస్ చూసిన రవి అతని దగ్గరికి వెళ్ళాడు. సంపద ఉంటే సరిపోదు అని తెలుసుకున్నాడు. విక్రమ్ ని ప్రశంసించాడు.
రవి విక్రమ్ స్ఫూర్తితో తన వనరులని మంచి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. నీటి సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించాడు. గ్రామంలో వ్యవసాయం కోసం డబ్బులు ని ఖర్చు చేశాడు. ఇలా అగ్రికల్చర్ హబ్ని ఏర్పాటు చేశారు. డబ్బులు ఉంటే సక్సెస్ రాదని ఆనందం ఉండదని ఈ కథను చూస్తే అర్థమవుతుంది. నేర్చుకోవాలని సంకల్పం ప్రతి మనిషికి ఉండాలని ఇది తెలియజేస్తోంది. కష్టాల నుండి గట్టెక్కాలంటే ఆర్థిక స్థితితో సంబంధం లేదని కూడా ఈ కథ మనకి తెలియజేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…