Belly Fat : చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అధిక బరువు, ఉబకాయం వంటి సమస్యలు ఉన్నట్లయితే ఇలా చేయండి. ఈ విధంగా పాటించినట్లయితే, బరువు సులభంగా తగ్గచ్చు. ఊబకాయం వంటి బాధలు కూడా ఉండవు. అన్నాన్ని తినడం మానేస్తే, త్వరగా మీరు బరువు తగ్గడానికి అవుతుంది. కూరల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మీరు నూనె తక్కువ వేసుకుని కూరలని వండుకొని, ఆ కూరలతో పాటుగా రెండు పుల్కాలని తీసుకుంటే, కడుపు నిండుతుంది.
పైగా బరువు తగ్గడానికి, ఉబకాయం వంటి బాధల నుండి బయటపడడానికి అవుతుంది. ఆయిల్ వేసుకుని వండుకోవడం వలన బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే, ఉప్పు కూడా ఎక్కువగా వేసుకుని వండుకోవడం వలన శరీరంలోకి నీరు చేరిపోతుంది. సాధ్యమైనంత వరకు ఈ రెండింటిని తగ్గించడం మంచిది. అయితే, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఊబకాయంతో బాధపడేవాళ్లు అన్నాన్ని మానేసి కూరల్ని బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి.

క్యాలరీస్ ఆకుకూరల్లో తక్కువగా ఉంటాయి. అలానే, కొవ్వు కూడా ఉండదు. కాబట్టి ఆకుకూరలని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఆకుకూరలు తీసుకుంటే కూడా బరువు తగ్గడానికి అవుతుంది. పండ్లను కూడా ఎక్కువగా తినేస్తూ ఉండండి. కడుపుని పండ్లతో నింపేస్తే కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పైగా బరువు తగ్గడానికి ఊబకాయం నుండి బయటపడడానికి కూడా అవుతుంది. కొవ్వు బాగా కరగాలంటే, రాత్రిళ్ళు ఆరు లేదా ఏడు గంటలకి భోజనం చేసేయాలి. అలా చేయడం వలన కొవ్వు ఎక్కువ కరగడానికి అవకాశం ఉంటుంది.
ఉదయం అల్పాహారం సమయంలో, మొలకలు, పండ్లు తీసుకోవాలి. అయితే, డైట్ లో ఇన్ని మార్పులు చేయడం వలన నీరసం వంటివి కలగకుండా ఉండాలంటే, మొలకలు మీకు ఉత్తమం. మొలకలను తీసుకుంటే ఎనర్జీ బాగా వస్తుంది. బలహీనత వంటి బాధలు ఉండవు. ప్రోటీన్ తో పాటుగా ఇతర పోషక పదార్థాలు కూడా మొలకల్లో నిండి ఉంటాయి. కాబట్టి, ఖచ్చితంగా మొలకల్ని ప్రతిరోజూ ఉదయం తీసుకుంటూ ఉండండి. మొలకలని, పండ్లను మీరు ఉదయం పూట తీసుకుంటే కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇలా ఈ ఆహార పద్ధతుల్ని పాటిస్తే ఖచ్చితంగా బరువు కంట్రోల్ లో ఉంటుంది. కొవ్వు కరుగుతుంది.