వేరుశెనగ పల్లీ కారం అంటే రాయలసీమలో ఎంతో ఫేమస్. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో పల్లీ కారం తినడానికి ఇష్టపడతారు. ఎంతో రుచికరమైన ఈ పల్లీ కారం వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. మరి అంతే రుచికరమైన పల్లీ కారం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
* వేరుశనగ పల్లీలు రెండు కప్పులు
* వెల్లుల్లి ఒక గడ్డ
* ఎండుమిర్చి ఒక 7
*చిన్న సైజు బెల్లం ముక్క (ఇష్టముంటేనే)
*ఉప్పు
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వేరుశనగ పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు మొత్తం ఎర్రగా వేయించుకున్న తరువాత ఎండు మిర్చి వేసి కొద్దిగా నూనె వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.ముందుగా రుబ్బు రోలులో వేయించుకున్న ఎండు మిర్చి,రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.అందులో వేరుశనగ పల్లీలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం మెత్తగా అయిన తరువాత వెల్లుల్లి వేసి బాగా రుబ్బుకోవాలి. కొందరికీ ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే లేదు.ఈ విధంగా తయారైన వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…