Ragi Onion Roti : ఈరోజుల్లో, చాలామంది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని తీసుకుంటున్నారు. అల్పాహారం సమయంలో కూడా, ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటి చిరుధాన్యాలని ఈ రోజుల్లో చాలా మంది తింటున్నారు. ప్రస్తుతం రాగులు, సజ్జలు వంటివి ఎవరి ఇళ్లల్లో కూడా ఉండట్లేదు. రాగి పిండితో చేసిన చపాతి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాగులు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. రాగి పిండితో మనం చపాతి వంటివి కూడా తయారు చేసుకోవచ్చు.
ఆరోగ్యానికి ఇలా చపాతీలు చేసుకుని తీసుకుంటే, ఎంతో మేలు కలుగుతుంది. ఈరోజుల్లో చిన్న వయసులోనే, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే, కచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకోవాలి. రోజూ రాగి జావా తీసుకోవాలని అనిపించదు. అలానే రాగి అన్నం కూడా తినడం కష్టంగా ఉంటుంది. టిఫిన్ గా, మీరు ఇలా వెరైటీగా చేసుకుంటే తినాలని అనిపిస్తుంది. రుచి, ఆరోగ్యం కూడా.
రాగులని తరచూ తీసుకోవడం వలన, బాడీ చల్లగా మారుతుంది. షుగర్ పేషెంట్లు కూడా రాగులని తీసుకోవచ్చు. అయితే, మరీ ఎక్కువ తీసుకోవద్దు. మరీ ఎక్కువగా తీసుకుంటే, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అని గుర్తు పెట్టుకోండి. ఇక ఈరోజు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో రాగి పిండి, ఉప్పు, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. చపాతీ పిండిని కలుపుకున్నట్టు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. రాగి పిండి కలిపేటప్పుడు, కచ్చితంగా ఉండలు లేకుండా చూసుకోండి, లేదంటే అస్సలు బాగోదు, బాగా కలుపుకున్న పిండిని, ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి,
తర్వాత, చపాతీలు చేసుకున్నట్లు వీటిని కూడా ఒత్తుకోవాలి. రెగ్యులర్ గా మనం చపాతీల మీద బాగా ఒత్తిడి పెట్టి చేస్తూ ఉంటాము. అలా చేస్తే, ఇవి పీటకే అతుక్కుపోతాయి. సున్నితంగా పొడి పిండి వేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పెనం పెట్టి, తర్వాత చపాతీలని రెండు వైపులా కాల్చుకోవాలి. ఆయిల్ తో కూడా మీరు కాల్చుకోవచ్చు. లేదంటే, జొన్న రొట్టెల్ని కాల్చుకున్నట్లు కూడా కాల్చుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని మీరు రైతాతో కానీ టమాటా పచ్చడి లేదంటే మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు. ఇలా అల్పాహారం సమయంలో ఆరోగ్యకరమైన ఈ చపాతీలను చేసుకుని తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…