దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. జనవరి 16, 2021వ తేదీన అట్టహాసంగా టీకాల పంపిణీని ప్రారంభించినా ప్రస్తుతం ప్రజలు భారీ ఎత్తున టీకాలను తీసుకునేందుకు కేంద్రాలకు వెళ్తుండడంతో టీకాలకు కొరత ఏర్పడింది. దీంతో చాలా చోట్ల కొత్త వారికి టీకాలను ఇవ్వడం లేదు. కేవలం రెండో డోసు టీకాలను మాత్రమే ఇస్తున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సర్టిఫికెట్ తప్పకుండా ఇస్తారు. మరి ఆ సర్టిఫికెట్‌తో తరువాత మనకు ఏదైనా ఉపయోగం ఉంటుందా ? అంటే…
కోవిడ్ టీకా తీసుకున్న తరువాత ప్రతి ఒక్క లబ్దిదారుడికి సర్టిఫికెట్‌ను కచ్చితంగా అందజేస్తారు. రెండు డోసుల టీకాను తీసుకున్నాకే సర్టిఫికెట్‌ను ఇస్తారు. దాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందజేస్తుంది. టీకా సర్టిఫికెట్‌పై లబ్ధిదారుడి పేరు, వయస్సు, లింగం, ఐడీ వివరాలు ఉంటాయి. అలాగే ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు (కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్, స్పుత్‌నిక్) అనే వివరాలతోపాటు, టీకాలు తీసుకున్న తేదీలు, ఎవరు టీకా వేశారు, ఎక్కడ వేశారు, రెండు టీకా డోసులకు ఎంత గ్యాప్ ఇచ్చారు ? అనే వివరాలు సర్టిఫికెట్ ద్వారా తెలుస్తాయి.
అయితే టీకా రెండు డోసులు తీసుకున్న తరువాత సర్టిఫికెట్ ను పొందుతాం. కానీ దాంతో తరువాత ఏం ఉపయోగం ఉంటుంది ? అంటే.. విదేశాలకు వెళ్లేవారికి ఈ సర్టిఫికెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్ పాస్‌పోర్టు వచ్చినట్లు భావిస్తారు. దీంతో కోవిడ్ ఆంక్షలు ఉండవు. సులభంగా విదేశాలకు వెళ్లవచ్చు. ముందు ముందు కోవిడ్ టీకాలను తీసుకున్న వారినే అనుమతిస్తాం, వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు, వారు మాస్కులను ధరించాల్సిన పనిలేదు.. అంటే.. అలాంటి సందర్భాల్లో ఈ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్నట్లు రుజువు ఉంటుంది. ఇది హాస్పిటల్స్‌లో పనిచేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్సను తీసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…