Pesticides On Vegetables : కూరగాయలు, ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో ఒక భాగం. అధిక దిగుబడి కోసం ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకం ఎక్కువయింది. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కూడా రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. వాటిని డైరెక్ట్ గా తీసుకుంటే అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అలా కాకుండా కూరగాయలపై ఉండే రసాయనాలను క్లీన్ చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలామంది చల్లని నీటిలో కూరగాయలను వేసి కడుగుతారు. చల్లని నీటిలో వేసినప్పటికీ వాటిని బాగా రుద్దితేనే కూరగాయలపై ఉన్న రసాయనాలను తొలగించగలుగుతాం. కూరగాయలపై ఉండే రసాయనాలను క్లీన్ చేయడానికి ఉప్పు నీరు మనకు చాలా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు వేసి అరగంట పాటు కూరగాయలను అందులో వేసి ఆ తర్వాత వాడుకుంటే రసాయనాలు సమూలంగా తొలగిపోతాయి. కూరగాయలపై రసాయనాలను తొలగించడానికి వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఒక కప్ వెనిగర్ చేర్చి ఆ వాటర్ లో కూరగాయలు నానబెట్టి అరగంటయ్యాక వాడుకోవాలి.
ఎక్కువ టైం లేని వాళ్లు ఒక టీస్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల వెనిగర్, ఒక కప్ వాటర్ లో కలుపుకుని స్ప్రే బాటిల్ ల్ నింపుకోవాలి. కూరగాయలు కట్ చేసుకునే ముందు ఆ మిశ్రమాన్ని కూరగాయలపై స్ప్రే చేసి వెంటనే కట్ చేసుకోవచ్చు. పండ్లు కానీ, కూరగాయలకు కానీ పైన తొక్క తీసి వాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కానీ అన్నింటినీ అలా వాడుకోవడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూరగాయలు లేదా ఆకుకూరలు, పండ్లు ఏవైనా సరే బాగా కడిగిన తరువాతే తినడం శ్రేయస్కరం. లేదంటే రసాయనాల బారిన పడి మనం తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వాటిని తప్పనిసరిగా బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…