Angry : కోపం అనేది చాలా మందికి వచ్చే ఓ సహజ సిద్ధమైన చర్య. కొందరికి పట్టరానంత కోపం వస్తే కొందరికి వచ్చే కోపం సాధారణంగానే ఉంటుంది. దాన్ని ఎలాగైనా వారు అణచుకుంటారు. కానీ ఇంకా కొందరు ఉంటారు.. అలాంటి వారికి కోపం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి స్థితిలో వారు ఏం చేస్తారో వారికే తెలియదు. తిడతారు లేదంటే కొడతారు. ఇంకొందరు తమ దగ్గర అందుబాటులో ఉన్నవి విసిరేస్తారు. ఈ క్రమంలో అలాంటి వారికి వచ్చే కోపం ఓ పట్టాన తగ్గదు. దీంతో వారిని చూసే వారికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే అందుకు ఓ పరిష్కారం ఉందండోయ్. ఏంటి..? అంటారా..? అదేంటో మీరే చదివి తెలుసుకోండి..!
ఎవరికైనా పట్ట రానంత కోపం వస్తే వెంటనే వారి నోట్లో కాస్తంత చక్కెర పోయాలట. దీంతో వారి కోపం ఇట్టే తగ్గిపోతుందట. ఇది మేం చెబుతోంది కాదు. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలిన నిజం. ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పలువురు పరిశోధకులు చక్కెరకు, కోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇటీవలే కనుగొన్నారు. అదేమిటంటే.. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు దాన్ని అణచుకోవాలంటే వారికి అధిక మొత్తంలో శక్తి కావల్సి వస్తుందట. అందుకు శరీరంలో గ్లూకోజ్ బాగా అవసరం అవుతుంది.
ఈ క్రమంలో అలా శరీరానికి గ్లూకోజ్ ఇచ్చేందుకు చక్కెర తినాలి. చక్కెరలో బాగా క్యాలరీలు, గ్లూకోజ్ ఉంటాయి కదా. అవి వెంటనే శరీరంలో చేరి ఆ వ్యక్తికి కావల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో వారి కోపం ఇట్టే తగ్గుతుందట. దీన్ని పైన చెప్పిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అయితే చక్కెర అందుబాటులో లేకపోతే చక్కెర కలిపిన పానీయం లేదా చక్కెర కలిపిన నిమ్మకాయ నీళ్లు వంటివి తాగవచ్చట. అలా చేసినా కోపం అదుపులోకి వస్తుందట. ఇంకెందుకాలస్యం మరి..! మీ చుట్టూ అలా కోపం బాగా వచ్చే వారు ఎవరైనా ఉంటే వారి నోట్లో ఓ గుప్పెడు చక్కెర పోసేయండి.. దాంతో వచ్చే ఫలితం మీరే చూస్తారు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…