మన దేశంలో వివిధ రకాల విలువలతో కూడిన కరెన్సీ నోట్లు చెలామణీలో ఉన్నాయి. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 ఇలా అనేక నోట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో రూ.1000 నోట్లు కూడా ఉండేవి. కానీ వాటిని, పాత రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2000 నోట్లను చెలామణీలోకి తెచ్చారు. అయితే మీకు తెలుసా ? సున్నా (0) రూపాయి నోట్లు కూడా చెలామణీలో ఉన్నాయి. కానీ నిజానికి వాటిని ఆర్‌బీఐ ప్రింట్ చేయదు. మరి ఈ సున్నా రూపాయి నోట్ల వెనుక అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
తమిళనాడుకు చెందిన 5th Pillar అనే ఓ ఎన్‌జీవో 2007లో ఈ సున్నా రూపాయి నోట్లను సృష్టించింది. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోయింది. ప్రజలకు ఉచితంగా సేవలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు, నేతలు లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లంచగొండితనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఆ ఎన్‌జీవో వారు సున్నా రూపాయి నోట్లను ప్రింట్ చేసి ప్రజలకు ఉచితంగా అందించడం మొదలు పెట్టారు.
ఎక్కడైనా, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు లంచం అడిగితే ఆ సున్నా రూపాయి నోట్లను వారికి ఇవ్వండని, అలాగే వారిపై ఫిర్యాదు చేయండని సదరు ఎన్‌జీవో వారు చెబుతున్నారు. అందుకోసమే వారు ఆ సున్నా రూపాయి నోట్లను ప్రింట్ చేశారు. ఆ సంస్థకు చెందిన వాలంటీర్లు ఆ నోట్లను ఇప్పటికే ఎన్నో లక్షల సంఖ్యలో పంచి పెట్టారు. అవి హిందీ, తెలుగు, కన్నడ, మళయాళం తదితర భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ నోట్లపై If anyone demands bribe, give this note and report the case. అనే సందేశం కూడా ప్రింట్ చేయబడి ఉంటుంది.
ఈ నోట్లను https://5thpillar.org/programs/zero-rupee-note/ అనే వెబ్‌సైట్ నుంచి మీరు కూడా ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా లంచం అడిగితే అసలు డబ్బుకు బదులుగా ఈ నోట్లను ఇచ్చి వారిని ఏసీబీకి పట్టించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…