ముఖ్య‌మైన‌వి

Chanakya Niti : మీరు ఎవరి చేతిలోనూ మోసపోవద్దు అనుకుంటున్నారా..? అయితే చాణక్య చెప్పిన ఈ 8 టిప్స్ ఫాలో అవ్వండి..!

Chanakya Niti : ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో రాజకీయాలు ఉండడం సహజం. తాను ఎదగడం కోసమో, లేదంటే ఇతరులను అణచడం కోసమో, ఇతర కారణాల వల్లో కొంత మంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు. అందుకు అవసరమైతే తమ తమ బాస్‌ల వద్ద లాబీయింగ్‌కు పాల్పడుతారు. చివరకు ఎలాగైతేనేం, తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విధంగా ఉండరు. కొందరు ఇలాంటి రాజకీయాలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. కానీ వారు కూడా ఇలాంటి రాజకీయాల బారిన పడాల్సి వస్తే? అప్పుడు ఏం చేయాలి? అందుకోసమే ఆచార్య చాణక్యుడు కొన్ని సూత్రాలను చెప్పాడు. వాటిని పాటిస్తే ఆఫీసు రాజకీయాల్లో మీరే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. మరి, చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి ఒక వ్యక్తిలో ఏదో ఒక బలహీనత దాగి ఉంటుంది. దాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఆ బలహీనతలు ఉన్న వ్యక్తులు మనకు లొంగి ఉంటారు. ఈ క్రమంలో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు తమ పక్కవారి బలహీనతలను తెలుసుకోవాలి. దీంతో వారిపై ఆధిపత్యం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఆ బలహీనతలను తెలుసుకోవాలంటే మాత్రం వారితో స్నేహం చేయాల్సిందే. అలా చేస్తేనే వారిపై పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Chanakya Niti

మనకు శత్రువులుగా ఉన్న వారి బలహీనతలను తెలుసుకోవడమే కాదు, సరైన సమయంలో వాటితో వారిపై అటాక్ చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఇతర పరిస్థితుల్లో మనం ఏం చేసినా వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. ఇతరుల పట్ల మనకు తెలిసిన బలహీనతలను మరొకరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు. అలా చేస్తే దాని వల్ల ఇతర వ్యక్తులు మనకన్నా ముందు దాని వల్ల లబ్ది పొందుతారు. శత్రువులుగా ఉన్నవారు ఎప్పుడైనా బలహీనతలను లక్ష్యంగా చేసుకునే తమ తమ అస్ర్తాలను ప్రయోగిస్తారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

శత్రువులు మనకు పట్టుబడినప్పుడు వారు మనతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చినా వారిని ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకూడదు. ఎక్కడ, ఏ సందర్భంలోనైనా మనం మంచి నడవడిక, ప్రవర్తనతో మెలిగినప్పుడే ఇతరులు మనకు విలువనిస్తారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇతరుల దృష్టిలో మనం విలువను కోల్పోతాం. మూర్ఖులుగా ఉన్న వారికి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఒక వేళ ఇచ్చినా వారు వాటిని ఎలాగూ పాటించరు కనుక, మన విలువైన మాటలు వృథాగా పోతాయి. అంతే తప్ప, పెద్దగా ఫలితం ఉండదు.

పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది కానీ మనతో మంచిగా ఉండదు కదా! అలాగే చెడు వ్యక్తిని చేరదీసి వారితో స్నేహంగా మెలిగినా వారు మాత్రం మనకు ఎల్లప్పటికీ చెడే తలపెడతారు. ఎందుకంటే వారికి చెడు చేయడంలోనే తృప్తి లభిస్తుంది. క‌నుక ఈ సూచ‌న‌లు పాటిస్తే ఇత‌రుల చేతిలో మోస‌పోకుండా ఉండ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM