కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 50 రోజులలో దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పరిగెత్తడానికి భారతీయ ఆర్మీ క్రీడాకారుడు సిద్ధమయ్యారు. భారత సైన్యానికి చెందిన అథ్లెట్ పి.వేలు గురువారం ఈ మిషన్ ప్రారంభించాడు. భారత సైన్యపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ శ్రీనగర్ నుంచి ఈ పరుగును ప్రారంభించారు. ఈ పరుగును ఢిల్లీ, ఇండోర్, బెంగళూరు మీదగా కన్యాకుమారి చేరుకోవాలని భావించారు. ఫ్లాగ్ అఫ్ వేడుకలో భాగంగా అనేక మంది ఆర్మీ అధికారులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
అథ్లెట్ పి.వేలు తన పాఠశాల రోజుల్లోనే ఎక్కువ దూరం పరుగెత్తడం ప్రారంభించాడు. అదే విధంగా భారత సైన్యంలో చేరడానికి ముందు అనేక మారథాన్‌లలో పాల్గొన్నాడు. ‘గ్రీన్ ఇండియా’, ‘ఒక దేశం వన్ స్పిరిట్’ అనే రెండు నినాదాలతో వేలు.. తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఈ విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరుగు తీసి గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకోవడమే తన లక్ష్యమని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ పరుగులో తనకు అవసరమైన సహాయ సహకారాలను ఆర్మీ బృందం అందిస్తామని తెలియజేయడంతో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అథ్లెట్ పి.వేలు గత ఏడాది 1600 కిలో మీటర్ల పరుగు లో లిమ్కా రికార్డు సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది నాలుగు వేల కిలోమీటర్లు 50 రోజులలో పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించడమే తన లక్ష్యమని,వాస్తవానికి 50 రోజులు అనుకున్నప్పటికీ కేవలం 47 రోజులలోనే తన టార్గెట్ పూర్తి చేయాలనుకుంటున్నట్లు టి. వేలు తెలిపారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…