ప్రస్తుత సమాజంలో చాలామంది జంటలు పెళ్లి చేసుకొని మూన్నాళ్ళయినా కాకముందే విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటే వారి వివాహ జీవితంలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుందని చాణిక్యుడు చెప్పాడు. ఈ విధంగా చేయడం వల్ల జీవిత భాగస్వామిపై నమ్మకం పోతుందని, అనుమానం పెరిగి అది వారి సంబంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పాడు.
కోపంతో ఉన్న వ్యక్తిని మరింత కోపం పెరిగేలా చేయడం కూడా భార్య భర్తల మధ్య సంబంధాన్ని చెడగొడుతుంది. దీని వల్ల ఇతరులకు హాని కలిగే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అందువల్ల కోపం పనికిరాదు. భార్య భర్తలు అన్నాక కొన్ని విషయాలలో పరిధి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరి రహస్యాలు వారి దగ్గరే ఉండాలి. ఇలాంటి రహస్య విషయాలను మరొకరితో పంచుకుంటే అవి మీ జీవిత భాగస్వామిని బాధపెడతాయి. అప్పుడు మీ సంబంధం బలహీనపడి తగాదాలకు దారి తీస్తుంది.
భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి తప్ప కించపరచుకోకూడదు. ఇలా చేయడం వల్ల చిన్న విషయాలు పెద్దగా అయిపోయి గొడవ ఏర్పడి ఈ బంధంపై ప్రభావం పడుతుంది. ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడూ ప్రేమానురాగాలతో జీవించాలి. ఈ దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే మాత్రం మీ బంధం ఎక్కువ కాలం కొనసాగదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశాడు. కనుక ఈ కారణాలను తెలిసి అర్థం చేసుకుంటే దంపతులు తమ మధ్య దూరం రాకుండా చూసుకోవచ్చు. దీంతో వారు విడిపోకుండా ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…