Vishnu Priya : విష్ణు ప్రియ కేవలం యాంకర్ గానే కాకుండా వెండితెరపై కూడా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్యకాలంలో ఈటీవీ ప్లస్ లో వచ్చిన పోవే పోరా షో ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వివిధ రకాల రియాలిటీ షోలలో కూడా తనదైన శైలిలో యాంకరింగ్ చేసి మంచి క్రేజ్ అందుకుంది.
ఖాళీగా ఉండకుండా ఇండస్ట్రీలో ఏదో ఒక పనితో ఆమె బిజీగా దర్శనమిస్తోంది. విష్ణు ప్రియకు సంబంధించి ఏ ఫొటో పోస్ట్ చేసినా కూడా క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది. రీసెంట్‌గా ఆమె మరొక సారి పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ లో ఘాటైన స్టెప్పులతో ఎంతగానో ఆకర్షించింది. ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. అనే పాటకు స్టెప్పులు వేసింది.
సమంతలా క్యాస్టూమ్స్ ధరించి, ఆమెలా మారిపోయి.. విష్ణుప్రియ స్టెప్పులు వేసింది. ఇక నాభి అందాలను చూపిస్తూ నడుముని తెగ తిప్పేసింది. అలా విష్ణుప్రియ తన అందాలను ఊపేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరంతా రెడీనా ? అంటూ రూంలో ఇలా ట్రై చేశాను అని విష్ణుప్రియ ఈ రీల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. విష్ణు ప్రియ వీడియోకి నెటిజన్స్ మతులు పోతున్నాయి.