Vijay And Mahesh Babu : ఇటీవల కాలంలో సౌత్ సినిమాల స్థాయి పెరగింది. బాలీవుడ్‌తో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఇక భాష తో సంబంధం లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలకు అయితే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతోంది. ఇక తమిళ హీరోలు ముందుగానే టాలీవుడ్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. అయితే కొందరు హీరోలు కొన్ని సినిమాలలో కలిసి నటిస్తే ప్రేక్షకులకి ఎక్కడలేని ఆనందం దక్కడం ఖాయం. అది జరిగితే బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సౌత్‌లో స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న మహేష్,విజయ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.
ఈ ఇద్దరు కలిసి నటించాల్సిన సినిమా జస్ట్‌లో మిస్ అయింది. ఆ సినిమా ఏంటంటే పొన్నియిన్ సెల్వన్. మహేష్, విజయ్ లను తన సినిమాలో నటింపజేసేందుకు మణిరత్నం ఎంతగానో ప్రయత్నించాడట. వందియాదవన్, అరుణ్‌మొళి వర్మన్ పాత్రల కోసం మణిరత్నం ఈ ఇద్దరు స్టార్ హీరోలను మొదట అనుకున్నాడట. అయితే అరుణ్‌మొళి వర్మన్ పాత్ర కోసం మహేష్ బాబును, వల్లవరైయన్ వందియాదవన్ పాత్రకు దళపతి విజయ్ బాగుందటుందని భావించి వారిని కలిసి విషయం చెప్పగా వారు నో చెప్పారట. ఇతర సినిమాలకి కమిట్ కావడం, వేరే కారణాల వలన వారు నో చెప్పడంతో ఈ పాత్రలను కార్తీ, జయం రవిలతో చేయించాల్సి వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ మూవీలో అరుణ్‌మొళి వర్మన్ (రాజ రాజ చోళ) పాత్రను జయం రవి, వందియాదవన్ పాత్రను కార్తీ పోషించారు.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రచయిత జయమోహన్ వెల్లడించడం విశేషం.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మెల్లగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు అతను నటించిన మాస్టర్ సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పది కోట్ల మార్కెట్ ఏర్పడడంతో ఆ మధ్య వచ్చిన సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. మరోవైపు మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…