వినోదం

Vichitra : ఏంటి.. ఆ హీరోయిన్లు బాల‌య్య‌పై ప‌గబట్టారా.. ఇందులో నిజమెంత‌?

Vichitra : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్య ఒక‌రు. ఇటీవలి కాలంలో వ‌రుస సక్సెస్‌లు అందుకుంటూ మంచి విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై తెగ సంద‌డి చేస్తున్నారు. అయితే బాల‌య్య ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్స్‌తో పాటు సీనియ‌ర్ హీరోయిన్స్‌తోను జోవియ‌ల్‌గా ఉంటారు. ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోను తెగ సంద‌డి చేస్తుంటారు. అయితే ఆయనపై తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కోలీవుడ్‌కు చెందిన సీనియర్ హీరోయిన్ విచిత్ర బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు అటు త‌మిళ సినీ పరిశ్రమతో పాటు ఇటు తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.నందమూరి బాలకృష్ణ సరసన భలేవాడివి బాసూ సినిమాలో నటించిన విచిత్ర ఓ గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో న‌టించింది.

అట్ట‌ర్ ఫ్లాప్‌గా న‌టించిన ఈ చిత్రంలో విచిత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. గి బాలకృష్ణ, శిల్పాషెట్టి, అంజల ఝవేరీ కాంబినేషన్‌లో 2001లో విడుదలైందీ మూవీ. పీఏ అరుణ్ ప్రసాద్ దర్శకుడు. బాలయ్య కేరీర్‌లో ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను కాస్టింగ్ కౌచ్ వేధింపులను ఎదుర్కొన్నానని విచిత్ర తెలిపారు. తాజాగా ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ 7కు గెస్ట్‌గా హాజరయ్యారు. సినిమాల్లో నటించేటప్పుడు తనకు ఎదురైన అనుభవాలను బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పంచుకున్నారు.నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్‌లో నటి విచిత్రను తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు.

Vichitra

దీనికి సమాధానంగా విచిత్ర మాట్లాడుతూ.. ”2001 సంవత్సరంలో నేను వేరే భాషలో ఒక సినిమాలో నటించాను. కానీ అదే నా చివరి సినిమా అయ్యిందని పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ మళంపుజ అడవుల్లో జ‌రిగింది. సినిమా షూటింగ్ స‌మ‌యంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్‌మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఆరోజు రాత్రి నేను క్యాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న‌ను ఎదుర్కొన్నాను. పార్టీ ముగిసిన అనంత‌రం సినిమా హీరో నా దగ్గ‌ర‌కు వ‌చ్చి డైరెక్ట్‌గా తన గదికి రమ్మని అడిగాడు. దాంతో నేను ఒక్కసారిగా షాకయ్యాను అని పేర్కొంది.

అప్పుడు నాకేమి అర్థంకాలేదు. తరువాతి నా గదికి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు షూటింగ్‌లొ పాల్గొన్నప్పటినుంచి తాను అనేక వేధింపులు, సమస్యలను ఎదుర్కొన్నాను. ఇక ఆ త‌రువాత సినిమాలంటే ఆసక్తి తగ్గిపోయిందని, పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నానని విచిత్ర తెలిపారు. అయితే ఈ వీడియోలో బాల‌య్య పేరును విచిత్ర ఎక్క‌డ వాడ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. అయితే విచిత్ర తమిళంలో కాకుండా వేరే భాషలో నటించిన ఏకైక చిత్రం భలేవాడివి బాసూ. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన బాల‌య్య గురించే ఆమె కామెంట్స్ చేసిందని ప‌లువురు చెప్పుకొస్తున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM