వినోదం

Venkatesh : నెట్‌ఫ్లిక్స్‌కి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన వెంక‌టేష్‌.. అస‌లు ఏం జ‌రిగింది..?

Venkatesh : విక్టరీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఆయ‌న ఎప్పుడు చాలా కూల్‌గా, సైలెంట్‌గా క‌నిపిస్తుంటారు. కాని ఎప్పుడు లేని విధంగా వెంకీమామ నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. నాతో మ‌జాక్‌లొద్దు నెట్‌ఫ్లిక్స్ జాగ్రత్త‌ అంటూ వెంకీమామ గ‌ర‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా చేతిలో గ‌న్ ప‌ట్టుకుని వార్నింగ్ ఇస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఇది నెట్టింట తెగ వైర‌ల్ గా మారింది. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేష్ తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్‌‌తో ‘గోపాల గోపాల’, రామ్‌తో ‘మసాలా’, వరుణ్‌ తేజ్‌తో ‘F2’ అండ్ ‘F3’, నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ చిత్రాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో కూడా చేయని విధంగా మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత అందుకున్నాడు. ఇప్పుడు దగ్గుబాటి రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి డిజిటల్ తెరపైకి ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ పేరు రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఈ సిరీస్ కు సంబంధించిన హిందీ వెర్షన్ టీజర్ ను ఇటీవల నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో చాలా డిఫరెంట్ లుక్ లో వెంకటేష్ కనిపించారు.

Venkatesh

అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉన్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌నున్నారని అర్ధ‌మ‌వుతుంది. జైల్లో చేతులకి సంకెళ్లతో తెల్లగడ్డంతో వెంకీ కొత్తగా కనిపించారు. తండ్రిపై చెప్పలేనంత ద్వేషంతో రగిలిపోయే కొడుకుగా రానా కనిపించాడు. అయితే ఈ సిరీస్ టైటిల్ మార్చాలంటూ గన్ పట్టుకుని మరి నెట్ ఫ్లిక్స్ కు వెంకటేష్ గట్టి ధమ్కీ ఇచ్చారు. “చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ నెట్ ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్ లో హీరో నేను. అందరి కంటే పెద్ద స్టార్ ని నేను. అందంగా కనిపించేది కూడా నేనే. పైగా ఫ్యాన్స్ కూడా నావాళ్లే. కాబట్టి షోకి కూడా నా పేరే ఉండాలి కాని రానా నాయుడు కాదు నాగా నాయుడు అని ఉండాలి. బాప్ కే పంగ నామాలు పెట్టొద్దు. నాతో మజాక్ లు చేయొద్దు” అంటూ గన్ పట్టుకుని హిందీలో మాట్లాడుతూ వెంకీ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM