Unreleased OTT Movies : కరోనా సమయం నుండి ఓటీటీల హంగామా ఎక్కువగా కొనసాగుతుంది. థియేటర్స్‌లో రిలీజైన సినిమాల కన్నా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లపైనే నెటిజన్స్ ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.మరోవైపు థియేటర్‌లలో రిలీజైన చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలని కూడా నెల లేదా రెండు నెలల గ్యాప్‌లో ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్స్‌లో విడుదలై ఏడాది అవుతున్నప్పటికీ ఇంకా ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఆ సినిమాలు ఏంటనేవి చూస్తే.. ముందుగా అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం ముందు వరుసలో ఉంటుంది.
ఏజెంట్ మూవీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయి ఏడు నెలలు దాటిన కూడా ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ సినిమాని సోనీ లివ్ దక్కించుకున్నప్పటికి ఏజెంట్ డిజాస్టర్‌గా నిలవడం, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య గొడవల ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. రెండు సార్లు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన కూడా కోర్టు ఇష్యూస్ వలన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో విడుదలయ్యేందుకు నోచుకోలేదు. ఇక నయనతార నటించిన కనెక్ట్ చిత్రం థియేటర్స్‌లో ఎప్పుడో విడుదల కాగా, ఇప్పటి వరకు ఓటీటీ విడుదలకి నోచుకోలేదు.
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా ప్రయోగాత్మకంగా రూపొందిన కనెక్ట్ చిత్రం గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్స్‌లో రిలీజైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీకి నోచుకోలేదు. మరోవైపు ది కేరళ స్టోరీ. థియేటర్లలో విడుదలై 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో నిర్మాతలకు లాభాల పంటను పడించిన ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఓటీటీ సంస్థలేవి ముందుకు రాలేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతో వివాదాలు తలెత్తుతాయనే భయంతోనే ఓటీటీ సంస్థలు కేరళ స్టోరీని రిలీజ్ చేయడానికి వెనకడుగు వేశాయి. ఇలా ఈ చిత్రాలు థియేటర్స్ లో విడుదలై చాలా రోజులే అయిన ఓటీటీకి నోచుకోకపోవడం గమనర్హం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…