Sriram Bigg Boss : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం కైవసం చేసుకున్నాడు. ఉద్వేగభరిత, ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. షణ్ముఖ్ రెండో స్థానంలో నిలవగా, మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర ఈ సీజన్‌లో మూడో స్థానంలో నిలిచాడు.
రెండో స్థానంలో చోటు దక్కించుకుంటాడనుకున్న శ్రీరామ్ మూడో స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలపాటు ఉన్న శ్రీరామ్ ఎంత గెలుచుకున్నాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే అతను వారానికి 2 నుంచి 2.50 లక్షల రూపాయలు అందుకున్నాడట. అంటే బిగ్‌బాస్ షో ద్వారా అతడు మొత్తంగా రూ.35 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది సభ్యులతో ప్రారంభం కాగా ఇందులో సరయు, ఉమా దేవి, లహరి శేరి, శ్వేతా వర్మ, ప్రియా, ప్రియాంక సింగ్, నటరాజ్ మాస్టర్, హమీద, విశ్వ, రవి, లోబో, అనీ మాస్టర్, జెస్సీ, ఆర్జే కాజల్, సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ చంద్ర కంటెస్టెంట్స్ గా హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఇక గ్రాండ్ ఫినాలేలో రాజమౌళి, సుకుమార్, నాగ చైతన్య, నాని, కృతి శెట్టి, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రష్మిక మందన్న వంటి చాలా మంది స్టార్స్ పాల్గొని తెగ సందడి చేశారు.