Spark Movie OTT Streaming : విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి కథను అందిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు విక్రాంత్. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లీల ఈ చిత్రాన్ని నిర్మించగా, నవంబర్ 17న ఈ చిత్రం రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రచారం లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో స్పార్క్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులని చాలా అలరిస్తుందని విశ్వసిస్తున్నారు మేకర్స్.
చిత్ర కథ విషయానికి వస్తే.. మెడికోగా ఉన్న జై(విక్రాంత్) కొందరు అమ్మాయిలని ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు కాసేపాటికే సైకోలుగా బిహేవ్ చేస్తూ చనిపోతుండడం, ఇలా అనేక హత్యలు జరుగుతుండటం, జైని కొంతమంది అనుమానించడం జరగడం జరుగుతుంది.. ఇదే సమయంలో హీరో.. మెహ్రీన్, రుక్సార్ లతో ప్రేమని నడిపిస్తాడు. పోలీసులకు అనుమానమొచ్చి జైని అరెస్ట్ చేస్తారు. దీంతో జై ఎవరు? అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు? ఈ హత్యలకు జైకి సంబంధం ఏంటి? అని సాగుతూనే ఉగ్రవాదుల మైండ్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే కొత్త పాయింట్ కూడా కథలో చెప్పారు. వీటన్నిటి గురించి తెలియాలంటే తెరపై స్పార్క్ చూడాల్సిందే.
కొత్తవాడైనా విక్రాంత్ రెండు వేరియేషన్స్ తో ప్రేక్షకులని మెప్పించాడనే చెప్పొచ్చు. రుక్సార్, మెహ్రీన్ తమ అందాలతో పాటలు కొన్ని ఎమోషన్ సీన్స్ లో అలరించారు. సీనియర్ నటి సుహాసిని ఓ కీలక పాత్రలో కనిపించింది. హీరో ఫ్రెండ్ గా సత్య మంచి కామెడీ పండించాడు. పోలీసాఫీసర్ గా బ్రహ్మాజీ, నాజర్, షాయాజీ షిండేలు మెప్పించగా నెగిటివ్ రోల్ లో మలయాళ నటుడు గురు సోమసుందరం అదరగొట్టారనే చెప్పొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…