ఇటీవల సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ చిన్నప్పటి పిక్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. గుండులో, బూరె బుగ్గలతో అమాయకంగా.. కనిపిస్తున్న ఈ చిన్నారిని చూసి అభిమానులు మైమరచిపోతున్నాయి. మరి ఆమె ఎవరా అనే కదా మీ డౌట్.. సమీరా రెడ్డి. నరసింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన సమీరా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆశోక్ చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఆమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. పెళ్లి తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న సమీరా.. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. కెరీర్ కు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తుంది.
తాను ప్రెగ్నేన్సీ సమయంలో లావుగా మారడంతో ఎన్నో ట్రోల్ ఎదుర్కొన్నానని.. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా శ్రమించానని కూడా చెప్పుకొచ్చింది. అలానే 1998లో మహేష్ బాబు సినిమా కోసం తొలిసారిగా తాను ఆడిషన్ కు వెళ్లి.. వాళ్లు ఇచ్చిన టాస్క్ సరిగా చేయక కన్నీళ్లతో ఇంటికి వచ్చినట్లు చెప్పుకొచ్చింది సమీరా. ఛాన్స్ అలా మిస్ కావడంతో అప్పటి వరకు తాను చేస్తున్న జాబ్ కంటిన్యూ చేయాలని అనుకుందట సమీరా. ఓ ప్రైవేట్ ఆల్చమ్ లో అవకాశాలు రావడం. ఆ తర్వాత వెండితెరపై వెలగడం చక చకా జరిగిపోయాయి. అంతేకాకుండా ఆడిషన్ కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు. సమీరా వెళ్లింది రాజకుమారుడు సినిమా కోసమే అని తెలుస్తుంది. సమీరా 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…