Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ అమ్మడు మయోసైటిస్ వలన సినిమాలకి దూరం కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. రీసెంట్‌గా సమంత సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అని సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌లో అభిమాని అడిగిన ‘పెళ్లి’ ప్రశ్నకు ఒక హిలేరియస్ ఆన్సర్ ఇచ్చారు. ఈ సమాధానాన్ని బట్టి ఇక ఆమె పెళ్లిచేసుకోరేమో అనే అనుమానం కలుగుతోంది. ఒక అభిమాని రెండో పెళ్లి గురించి ప్రశ్నించాడు. “మీరు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా..?” అని ప్రశ్నించాడు. దీనికి సమంత బదులిస్తూ.. డివోర్స్ కి సంబంధించిన ఒక సర్వే స్టాటిస్టిక్స్ ని షేర్ చేశారు.
ఆ స్టాటిస్టిక్స్ ఏంటంటే.. 2023 సర్వే ప్రకారం మెుదటి పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసులు శాతం 50% ఉందట. అదే రెండో, మూడో పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసులు శాతం 67%, 73% ఉందట. ఇక ఈ స్టాటిస్టిక్స్ బట్టి రెండో పెళ్లి పై ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది తప్పు నిర్ణయం అని సమంత చెప్పుకొచ్చింది. ఈ ఆన్సర్ బట్టి ఆమె ఇన్‌డైరెక్ట్ గా రెండో పెళ్లి చేసుకోను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
2023 వరకు చూసుకుంటే మొదటిసారి పెళ్లిచేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వారి రేటు సుమారు 50 శాతం వరకు ఉంది. ఇక రెండోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 67 శాతంగా ఉంది. అలాగే మూడోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 73 శాతంగా ఉంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ ఈ రేటింగ్ ఇలాగే ఉందట. సమంత ఈ లెక్కలతో సమాధానం ఇవ్వడాన్ని బట్టి.. ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా విడాకులు కామన్.. అలాంటప్పుడు ఇంక రెండో పెళ్లి ఎందుకయ్యా? అని చెప్పినట్టుంది. చూస్తుంటే సమంత రెండో పెళ్లికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే, అక్కినేని నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. కాని అనూహ్యంగా 2021 అక్టోబర్‌లో విడిపోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…