Samantha Gym Video : అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఏమాయ చేశావే చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఇక ఆమె రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాతో పలకరించింది. అయితే మయోసైటిస్ వలన కొద్ది రోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. పలు వర్కవుట్స్, ఆసనాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా వీడియో షేర్ చేసింది . “2023లో చివరిసారిగా వర్కౌట్ చేసాను. ఇలా ఈ సంవత్సరాన్ని మేము ఇలా ఎక్సర్ సైజ్‌తో ముగించనున్నాం అంటూ వీడియోను తన జిమ్ ట్రైనర్ జునైద్ షేక్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది.
వీడియోలో సమంత నేవీ బ్లూ స్పోర్ట్స్ బ్రా, గ్రే హై వెయిటింగ్ టైట్స్ ధరించి అదరహో అనిపించింది. ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్ ఎక్సర్ సైజ్ చేస్తున్న సమంత..భుజం కండరాలు బలంగా, పెద్దవిగా అయ్యేందుకు ఇలా చేస్తుంట. సమంత పక్కనే తన పెంపుడు కుక్న సాషా కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే సమంత నటించిన సిటాడెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రీక్వెల్‌గా ఇది రానుందని సమాచారం. సిటాడెల్ సిరీస్‌లో సమంతతోపాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. దీనికి డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్నారు. వీరు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ సిరీసులు తెరకెక్కించారు.
హీరో అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆ మధ్య అనారోగ్య సమస్యలతో ఈమె బాధ పడిన సంగతి తెలిసిందే కదా. ఇపుడిపుడే సామ్ కోలుకుంటుంది. విదేశాల్లో తన రోగానికి చికిత్స తర్వాత కోలుకుంటున్న ఈ స్టార్ హీరో కథానాయికకు ఓ నెటిజన్ నుంచి రెండో పెళ్లి గురించి ఓ క్వశ్చన్ ఎదురైంది.ఈ క్రమంలో మీరు మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదు ? అంటూ ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. సామ్ కాస్త ఆశ్చర్యపోయిన రీతిలో ఆన్సర్ ఇచ్చింది. 2023లో విడాకుల వివరాలను కోట్ చేస్తూ.. రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…