Rules Ranjan OTT : కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ ..ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత చాలాకాలం సరైన రిలీజ్ డేట్ దొరకక ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఇక అన్నీ ఓకే అనుకొని రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన తర్వాత మళ్లీ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. ఫైనల్‌గా అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే థియేటర్లో విడుదలయ్యి ఇన్నాళ్లయినా ‘రూల్స్ రంజన్’ ఇంకా ఓటీటీలోకి రావడం లేదని ఎదురుచూసిన మూవీ లవర్స్‌కు మూవీ టీమ్ అప్డేట్ ఇచ్చింది.
గురువారం (నవంబర్ 30) సాయంత్రం 6 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ఆహా ఓటీటీలో రానుందని వెల్లడించారు.. అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా జ్యోతీ కృష్ణ అలియాస్ రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్స్ రంజన్’ కాగా, చిత్రంలో టైటిల్‌కు తగినట్టుగానే ఈ సినిమాలో కిరణ్.. అన్ని రూల్స్‌ను పాటించే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ కంటే పాటలే సినిమాకు ఎక్కువగా హైప్‌ను తెచ్చిపెట్టాయి.
ఇందులో ‘సమ్మోహనుడా’ పాట చార్ట్‌బస్టర్ అయ్యింది. ఈ పాటలో నేహా గ్లామర్‌కు యూత్ మరోసారి ఫిదా అయ్యారు. అంతే కాకుండా నేహా వేసిన స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ చాలామంది సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇక ఈ పాటను ఓటీటీలో చూసే సమయం వచ్చేసింది.లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం, కామెడీ ఆశించిన స్టాయిలో వర్కవుట్ కాకపోవడంతో రూల్స్ రంజన్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది . ఫస్ట్ వీక్‌లోనే థియేటర్లలో కనిపించకుండాపోయిన ఈ సినిమా థియేటర్ రిజల్ట్ కారణంగా ఓటీటీ రిలీజ్ ఆలస్యమైనట్లు సమాచారం. దాదాపు నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రూల్స్ రంజన్ థియేటర్లలో రిలీజైంది. కేవలం కోటిన్నర వరకు మాత్రమే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…