Roshan Kanakala : తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయినటువంటి సుమ కనకాల ఇప్పుడు బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అనేక మంది బుల్లి తెర అభిమానుల హృదయాలను కూడా దోచుకుంది. కెరీర్ సజావుగా సాగుతున్న సమయం లోనే తెలుగు నటుడు అయినటువంటి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు జన్మించారు. కొడుకు రోషన్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు.
క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రాలతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో రోషన్ కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడవిశేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో రోషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రోల్స్ పై ఆయన స్పందన అందరిని ఆశ్చర్యపరిచింది.
మస్త్ కర్రిగా ఉన్నాడు, వీడు హీరో ఏంటి” అని తన గురించి చాలా మాట్లాడుకోవడం విన్నానని, చదివానని రోషన్ కనకాల అన్నాడు. కర్రగా ఉన్నానా?, తెల్లగా ఉన్నానా అనేది మ్యాటర్ కాదని ఇక్కడ టాలెంట్ ముఖ్యం అని చెప్పాడు రోషన్. వీడేంటి మస్త్ కర్రగా ఉన్నాడు వీడు హీరో ఏంటి? హీరో మొఖం కాదు, బొక్క వేస్ట్ హీరో మెటీరియల్ కాదు అన్నారు. నేను ఇలానే పుట్టాను. ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు, తెలుపు, అందం కాదు బ్రదర్ సక్సెస్ ని డిసైడ్ చేసేది. ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లెయిన్ మాత్రమే నిర్ణయిస్తుంది. మన అందరి జాతకంలో ఏం రాసి పెట్టిందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా, ఔకాద్ అయినా, ఒక రోజు వస్తది, వద్దనుకున్నా వినబడతా, చేవులు మూసుకున్నా వినబడతా. డిసెంబర్ 29న రాసిపెట్టుకోండి, థియేటర్‌కి వచ్చేయండి. ఆది గాడి లవ్‌ని చూడండి, ఆదిగాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ ని చూడండి` అంటూ రోషన్ చాలా వీరోచితంగా మాట్లాడాడు. ఆ మాటలకి సుమ కన్నీళ్లు పెట్టుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…