Rana Naidu : టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు. ఫ్యామిలీ మ్యాన్ అనే ముద్ర ఆయనకు ఉంది. కుటుంబ ప్రేక్షకులు, మరి ముఖ్యంగా మహిళలలో వెంకీ అభిమానులు ఎక్కువ ఉండగా వెంకీ ప్రతి సినిమాలని వారు తప్పక చూస్తారు. అయితే కొద్ది రోజుల క్రితం విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. వెంకటేష్ నటించాడు అనే సరికి కుటుంబం మొత్తం ఇంట్లో కూర్చొని ఈ వెబ్ సిరీస్ చూడగా, ఇందులో అడల్ట్ సీన్లు, బూతు డైలాగులు వెంకీ అభిమానులకు నచ్చలేదు. దాంతో తెలుగులో ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి.
రానా నాయుడు వెబ్ సిరీస్ మీద తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వెంకటేష్ వరకు వెళ్ళడంతో ఆయన రెండో సీజన్ విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నారు. సైంధవ సినిమాలో పాట విడుదల కోసం ఓ కాలేజ్‌కి వెళ్లిన వెంకటేష్‌ని ‘రానా నాయుడు’ రెండో సీజన్ గురించి ఓ స్టూడెంట్ ప్రశ్నించగా… ”వెళుతున్నా అమ్మా! జనవరి నుంచి స్టార్ట్ చేస్తా! నాగా నాయుడు మామూలోడు కాదు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసేశారు. ఇప్పుడు మళ్లీ తీయమంటున్నారు. అయితే… ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఏమో ‘ఏంట్రా నువ్వు అలా చేశావు’ అన్నారు. మీ కుర్రవాళ్ళు ఏమో అందరూ చూసేశారు. కాని ఈ సారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకుంటాను అని వెంకీ అన్నారు.
‘రానా నాయుడు’ ఫస్ట్ సీజన్ చూసి మనవాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు. ఏం పర్లేదు… ఈసారి చాలా చక్కగా ఉంటుంది. జాగ్రత్త పడతా. కాకపోతే కొంచెం కొంటెగా, అల్లరిగా ఉంటుంది” అని చెప్పారు. సైంధవ్ విడుదలయ్యాకే వెంకటేష్ ఫ్రీ కాబోతున్నారు. జనవరి 13 దాకా నాన్ స్టాప్ ప్రమోషన్లు ప్లాన్ చేసిన నేపథ్యంలో నెల రోజులకు పైగా పూర్తి షెడ్యూల్ దానికే ఇవ్వబోతున్నారు. గణేష్ తర్వాత ఆ రేంజ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సైంధవ్ లో ఉంటుందని అంచనాలు బలంగా ఉన్నాయి. హిట్ ఫస్ట్ కేసు, సెకండ్ కేస్ లతో వరస బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను తక్కువ టైంలోనే పెద్ద హీరోతో ఛాన్స్ కొట్టేశాడు. గుంటూరు కారం, ఈగల్, ఫ్యామిలీ స్టార్ తదితర సినిమాలతో సైంధవ్ కు గట్టి పోటీ ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…