Ramajogayya Sastry : ఇటీవలి కాలంలో సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ఎంత నెగెటివిటీ ప్రచారం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. చేతికి ఎంతొస్తే అంత రాసేసి పెట్టేసి వారిని మానసిక వేధనికి గురి చేస్తున్నారు. బూతులు తిడుతున్నారు. ఇలాంటి ధోరణి మంచి కాదని చెబుతున్నా కూడా ఎవరు కంట్రోల్‌లో ఉండడం లేదు. అయితే ప్రముఖ సినీ గేయ రచయిత ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రిపై సోషల్ మీడియాలో కొందరు పేట్రేగిపోతుండగా, వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రామజోయ్య. సోషల్ మీడియాలో కుక్కలు ఎక్కువైపోతున్నాయంటూ ఘాటుగా పేర్కొన్నారు.
మేటర్ లోకి వెళితే మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం చిత్రంలోని ఓ మై బేబీ పాట మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఈ పాటలోని ట్యూన్‌ను తమన్ కాపీ కొట్టాడంటూ జోరుగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఇక పాటలోని సాహిత్యం మరింత నాసిరకంగా ఉందని, అసలు అందులో సాహిత్యమే లేదని, క్రేవింగ్ క్రేవింగ్ అనే పదాలు తప్పా ఇంకేం లేదని కొందరు నెటిజన్స్ రామజోగయ్య శాస్త్రిని కూడా ట్రోలింగ్ చేశారు. ఆ పాటలో ఎక్కువగా ఇంగ్లీషు మిక్స్ పదాలు దొర్లాయి. అయితే ఈ పాట చెత్తగా ఉందంటూ నెటిజన్లు రామజోగయ్యశాస్త్రిపై పడ్డారు.
దీనిపై రామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రతివాడూ మాట్లాడే వాడే… రాయి విసిరే వాడే” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా… అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం… తెలసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి” అంటూ రామజోగయ్యశాస్త్రి ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అయితే రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోలింగ్ పట్ల కాస్త హర్ట్ అయినట్టుగా తెలుస్తుండగా, ఇందులో నెగెటివిటీ తట్టుకోలేక ట్విట్టర్ నుంచి వైదొలిగినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ ఖాతా కనిపించడం లేదు. తాత్కాలికంగా ట్విట్టర్‌కు దూరంగా ఉంటారా? లేదంటే.. మళ్లీ వస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…