Priyanka Singh Bigg Boss : బిగ్ బాస్ షోకు అంతటా ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో తెలిసిందే. హిందీలో ఎప్పుడో మొదలైన ఈ షో.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సారి హౌజ్‌లోకి 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగే. జెండర్ మార్చుకొని బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక తన ఆటలు, మాటలతో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రియాంక సింగ్ జీవితంలో ఎన్నోచీకటి కోణాలు ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తి దూరం కావడం, తల్లిదండ్రులకి భయపడి బతకడం, ఆపరేషన్ కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడం.. ఇలా ఎన్నో సమస్యలతో ఆమె బాధపడింది. అయితే ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో మొదట్లోనే తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి కారణాలను ఇంటి సభ్యులకు వివరించడమే కాకుండా ఆ విషయాన్ని తన తండ్రికి ఎలా చెప్పాలో అర్ధంకాక చాలా భయపడుతున్నానని తెలియజేసింది.
అయితే ట్రాన్స్‌జెండర్‌గా నిర్ణయం తీసుకునే ముందు తాను పెద్దమ్మ తల్లి దీవెనలు అందుకుందట. ఎవరి సలహా తీసుకోవాలో తెలియక పెద్దమ్మతల్లి దేవాలయానికి వెళ్లి.. రూపాయి కాయిన్‌ని నిలబెట్టి తన మనసులో కోరిక అమ్మవారితో చెప్పుకుందంట. అయితే ఆ రూపాయి కాయిన్ పడిపోకుండా నిలబడిన కారణంగా ప్రియాంక ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుంది. అమ్మవారి సన్నిధిలో రూపాయి కాయిన్‌ని నిలబెట్టి మనసులో కోరిక కోరుకుంటారు.. ఆ కాయిన్ పడిపోతే ఆ కోరిక నెరవేరదని.. ఒకవేళ ఆ కాయిన్ నిలబడే ఉంటే.. తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని.. బలంగా నమ్ముతుంటారు భక్తులు.